పది నిమిషాలుకి నలభై లక్షలు తీసుకున్న కుర్ర హీరోయిన్?

ఓ నిమిషం పాటు కనబడితే దాన్ని అతిథి పాత్ర అని అంటారు.సామాన్యంగా అలాంటి పాత్రలు చేసినప్పుడు డబ్బులు తీసుకోరు స్టార్స్.

 What? 40 Lakhs For Avika Gor For An Extended Cameo?-TeluguStop.com

ఇక సెటిల్ అవని కుర్ర నటీనటులు మాత్రం ఎంతోకొంత అడుగుతారు.ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో ఆవికా గోర్ చేసింది అతిథి పాత్ర కన్నా కొంచెం పెద్ద పాత్ర.

ఓ పది-పదిహేను నిమిషాలు కనిపిస్తుంది ఆవికా.అంతమాత్రానికే ఈ అమ్మడుకి ఎక్కువ డబ్బు చెల్లించేసాడు నిర్మాత.

మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అవికా ఏకంగా 40 లక్షలు తీసుకుందట.సినిమా మొత్తం నటించినా, అవికాకు అంత చెల్లించడం ఎక్కువే.

అలాంటిది పది నుంచి పదిహేను నిమిషాలు కనబడినందుకు మరీ అంత ఎమౌంట్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు.

అయిదేదో అయిపోయింది.

చిన్న పాత్ర అయినా, కథలో కీలకమైన పాత్ర పోషించింది ఈ కుర్ర హీరోయిన్.సినిమాకి సూపర్ టాక్ వచ్చాక, పారితోషికం గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube