ఇది విన్నారా.. కరోనా టెస్టుకు 40 లక్షల బిల్లు..ఎక్కడంటే!

కరోనాఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు సైతం వణికి పోతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను అల్లకల్లోలం చేసింది.

 40 Lakh Bill For Covid 19 Test In America, Corona Test, Corona Virus, Covid 19,-TeluguStop.com

అసలు ఇలాంటి వ్యాధి వచ్చి ప్రజలను ఇబ్బంది ఎపుడుతుందని ఎవ్వరు ఊహించలేదు.కరోనా కారణంగా లక్షలాది మంది ప్రజలు చనిపోయారు.

కోట్లాది మంది ఈ వ్యాధికి గురి అయ్యి అవస్థలు పడ్డారు.కరోనా కారణంగా తినడానికి తిండి లేక ఉపాధి కూడా కోల్పోయి చాల దుర్భరమైన జీవితం అనుభవించారు.

మన దేశంలో కంటే అగ్ర రాజ్యమైన అమెరికా అయితే కరోనా కు గడగడ వణికి పోయారు.ఇక్కడ ఆసుపత్రులన్నీ ఫుల్ అయ్యి రోగులకు చికిత్స కూడా అందలేదు.

చికిత్స అందక లక్షలాది మంది ప్రజలు కరోనా తో మరణించారు.ఇక ఈ మధ్యనే వ్యాక్సిన్ రావడంతో అందరు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు.

మళ్ళీ అంతలోనే కరోనా సెకండ్ వేవ్ నానా బీభత్సం చేసింది.

మన దేశంలో అయితే కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది.

అమెరికాలో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.అక్కడ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు ఫజులు వసూలు చేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నారు.

చాలా చోట్ల ప్రభుత్వాలు కరోనా టెస్టులను ఉచితంగా చేస్తున్నారు.కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఫీజు వసూలు చేసే టెస్ట్ చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి.

Telugu Covid America, Corona, Covid, Dallas, Pcr-Latest News - Telugu

కానీ అమెరికాలో మాత్రం అలంటి నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యం ఇష్టమొచ్చిన్నట్టు ఫీజులు వసూలు చేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నారు.ఇక్కడ సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు.డల్లాస్ కు చెందిన ఒక వ్యక్తి కరోనా టెస్టులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేయించు కున్నాడు.

అయితే టెస్టుల తర్వాత రిపోర్ట్ లో బిల్లు చూసి షాక్ అయ్యాడు.

Telugu Covid America, Corona, Covid, Dallas, Pcr-Latest News - Telugu

అతడికి పిసిఆర్ టెస్టుల కోసం ఏకంగా 4 వేల డాలర్లు బిల్లు వేసింది.ఇది మన కరెన్సీ లో అక్షరాల 40 లక్షలు అన్నమాట.అంత బిల్లు చూసి అతడు షాక్ అయ్యాడు.

కానీ అతడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ బిల్లును వాళ్లకు పంపించాడు.ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బిల్లు చూసి షాక్ అయ్యింది.

అయితే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి 54 వేల డాలర్లు ఉన్న బిల్లును 16,915 డాలర్లకు మాట్లాడి చెల్లించారు.మొత్తానికి అతడికి ఇన్సూరెన్స్ ఉండి బ్రతికిపోయాడు లేదంటే పరిస్థితి ఏంటో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube