ఆ ఇద్దరు లవర్స్ కారులో ఏం చేసారో తెలుస్తే కన్నీళ్లొస్తాయి..! అబ్బాయి ఓనర్, అమ్మాయి ఉద్యోగి!       2018-06-07   22:23:02  IST  Raghu V

ఇంట్లో వాళ్ల చావును చూడలేని ఓ ప్రేమ జంట.. వాళ్లే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. అతని పేరు సల్మాన్.. 26 ఏళ్లు.. ముంబైలో ప్రేరుమోసిన ఓ బట్టల దుకాణానికి ఓనర్. మంచిగా డబ్బులు సంపాదించాడు.. 20 లక్షల కారులో తిరుగుతుంటాడు.. ముంబైలో ఇల్లు ఉంది.. కుటుంబం పెద్దది.. ఎలాంటి బాధలు లేవు.. చెడు అలవాట్లు కూడా లేవు. ఆమె పేరు మనీషా నారాయణ్.. 21 ఏళ్లు.. చాలా అందంగా ఉంటుంది.. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో ఉద్యోగం. నాలుగేళ్లుగా.. ఒకరు అంటే ఒకరు విడిచి ఉండలేనంతగా గాఢ ప్రేమ. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. రెండు కుటుంబాలు ససేమిరా అన్నాయి. మేం చావనైనా చస్తాం కానీ.. మీ పెళ్లి చేయం అని రెండు కుటుంబాలు ఖరాఖండిగా చెప్పాయి.

ఎలాగైనా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు వీళ్లద్దరూ ఎన్నో రకాలుగా ఒప్పించే ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేదు. ఒకరిది వ్యాపారం, మరొకరిది ఉద్యోగం. బయటకు వెళ్లిపోయి హాయిగా బతికేయొచ్చు. ఆర్థికంగానూ బలంగా ఉన్నారు. అయినా వారు అలా చేయలేదు. కుటుంబంతోనే కలిసి ఉండాలని చివరి వరకు ప్రయత్నించారు.

-

కలిసి బతకలేం అనుకున్నా ఈ జంట.. వారికి ఇష్టమైన కారులోనే బుధవారం సాయంత్రం విషం తీసుకుని చనిపోయారు.ముంబై ములుంద్ లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో కారు అనుమానాస్పందంగా ఉండటం.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు ఇంజిన్ ఆన్ చేసి ఉండటంతో డోర్స్ బ్రేక్ చేసి చూశారు. అప్పటికే ఇద్దరూ చనిపోయి ఉన్నారు. షోడాలో విషం కలుపుకుని తీసుకున్నారు