కన్న బడ్డిని చంపిన తండ్రి..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు       2018-06-11   01:17:36  IST  Raghu V

దేవుడిని నమ్మచ్చు ఎవరి మాట విశ్వాసాలు వారికి ఉంటాయి అయితే మరీ కళ్ళు మూసుకుపోయే దైవభక్తి ఉంటే అది ఎంతో ప్రమాదకరం..మూడ నమ్మకాలు..నరబలులు ఇలాంటి కోవలోకి వస్తాయి..మనం ఏమి చేస్తున్నామో మన విజ్ఞతకి కూడా తెలియకపోతే ఇక మనం బ్రతికి ఉందీ వ్యర్ధం అవుతుంది..అభివృద్ధి అంటూ దూసుకుపోతున్న ప్రపంచం లో ఇంకా మూడనమ్మకాలు రాజ్యమేలుతుంటే ఇంతకూ మించి దారుణం మరొకటి ఉండదనే చెప్పాలి. అల్లా కృప ఉండాలి అని ఒక వ్యక్తి తన కన్న కూతురిని అల్లా కి బలి ఇచ్చిన సంఘటన సంచలనం సృష్టించింది..

పవిత్ర రంజాన్ మాసంలో అల్లాను సంతృప్తి పరచడం కోసం..ఓ కసాయి తండ్రి తన నాలుగేళ్ల బిడ్డను చంపేశాడు.. అత్యంత పాశవికంగా చంపేశాడు..ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నవాబ్ అలీ ఖురేషి అనే ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఖురేషీ కుటుంబం తన ఇంటి టెర్రస్పై నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న నాలుగేళ్ల పాపను కిందకి తీసుకుని వచ్చి కత్తితో ఆ చిన్నారి గొంతు కోశాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పైకి వెళ్లి పడుకున్నాడు..

అయితే తెల్లవారుజామున తన పాప కనిపించకపోయేసరికి తల్లి తీవ్ర ఆందోళనకు లోన్నయ్యింది అంతా వెతుకుతూ కిందకి వెళ్ళిన ఆమెకి తన బిడ్డ చనిపోయి ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది..అయితే పోలీసుల విచారణలో కన్నా తండ్రి ఆమెని చంపాడని తెలుసుకుని షాక్ కి గురయ్యారు కుటుంభ సభ్యులు అయితే తానూ అల్లాని సంతృప్తి పరచడానికి మాత్రమె అలా చేశానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు..