కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఇక కొంతమందిని కదిలిస్తే కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి అని చెప్పాలి.
అంతలా కష్టాలు పడ్డారు ప్రతి ఒక్కరు.సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత సినిమా షూటింగ్ లను ముందుకు నడిపించ లేక ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను విడుదల చేయలేక అయోమయంలో మునిగిపోయారు.
కానీ ఇప్పుడు మాత్రం వైరస్ ప్రభావం తగ్గడంతో వరుసగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాలు విడుదలవుతున్నాయి.ఇక ప్రతి వారం ఒక సినిమాకు పోటీగా మరో సినిమా ఉంటూనే ఉంది.
అయితే ఇటీవలి కాలంలో బాక్సాఫీసు వద్ద విడుదలై ఢీ కొట్టిన ఏ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకో లేదు అని చెప్పాలి.అయితే కరోనా వైరస్ కారణంగా ఇన్నాళ్ల పాటు తమ సినిమాను వాయిదా వేసిన వారు ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో విడుదల చేయడానికి రెడీ అయిపోయారు.
ఈ క్రమంలోనే అడవిశేషు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మేజర్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.మే 27వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నప్పటికీ పోస్ట్ ఫోన్ చేసుకుని జూన్ 3న థియేటర్ లోకి రావాలని నిర్ణయించుకున్నారు.
ఈ సినిమాపై భారీ రేంజిలో అంచనాలు ఉన్నాయి.

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ కూడా అదే రోజు ఉండడం గమనార్హం.ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ లాంటి విలక్షణ నటులు ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పృద్విరాజ్ సినిమా సైతం జూన్ 3వ తేదీన విడుదలకు సిద్ధమైంది.

హిందితో పాటు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.అజయ్ దేవగన్ నటించిన మైదాన్ సినిమాకి అదే డేట్ లాక్ చేసినట్లు టాక్.ఈ సినిమా కూడా హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.ఇలా ఏకంగా నాలుగు సినిమాలు ఒకే రోజు థియేటర్లో ప్రేక్షకుల ముందు సందడి చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలలో చివరికి ఏది నిలిచి గెలుస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.