దక్షిణాఫ్రికా : భారత సంతతి వ్యాపారవేత్త నలుగురు పిల్లలూ కిడ్నాప్.. మూడు వారాల తర్వాత విముక్తి

కిడ్నాప్‌కు గురైన దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త నలుగురు పిల్లలు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నారు.మూడు వారాల క్రితం నలుగురు స్కూలుకు వెళ్తుండగా సాయుధులైన దుండగులు వీరిని అపహరించుకుపోయారు.

 4 Sons Of S African Indian-origin Trader Returned 3 Weeks After Kidnapping , Zid-TeluguStop.com

ఈ మేరకు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు.పోలోక్‌వానేలో వున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త నజీమ్ మోతి కుమారులు జిదాన్ (7), జయ్యాద్ (11), అలాన్ 13, జియా (13) బుధవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 21న పాఠశాలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును రెండు వాహనాల్లో వచ్చిన సాయుధులైన దుండగులు అడ్డుకున్నారు.వీరంతా తెల్లటి రంగు దుస్తులు ధరించి వున్నట్లు .కారు డ్రైవరు తెలిపారు.దీనిపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.

గాలింపు చర్యలు చేపట్టారు.మూడు వారాలు గడుస్తున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నజీమ్ ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసు ప్రతినిధులు తెలిపారు.పిల్లలను ఇంటికి సమీపంలోని రోడ్డు వద్ద దింపినట్లు కుటుంబసభ్యులు తమకు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే పిల్లలను అప్పగించేముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.టెస్టుల అనంతరం డాక్టర్ మాట్లాడుతూ.

పిల్లలు ఆరోగ్యంగానే వున్నారని తెలిపారు.అయితే ఫోరెన్సిక్, క్లినికల్ సైకాలజిస్ట్‌ల బృందం బాధిత కుటుంబాన్ని సందర్శిస్తుందని అధికారులు తెలిపారు.

Telugu Africanindian, Africa, Alan, Jayad, Martin Evie, Zidane-Telugu NRI

కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి రావడంతో గడిచిన మూడు వారాలుగా ఈ పిల్లలు క్షేమంగా విడుదల కావాలని దేశవ్యాప్తంగా ప్రార్ధనలు మిన్నంటాయి.అటు పోలీసులు ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి.ఈ కేసు దర్యాప్తు కోసం దేశవ్యాప్తంగా పోలీసు అధికారులతో కూడిన బృందాన్ని మోహరించారు.అయితే పిల్లలను కిడ్నాపర్లు విడుదల చేయడం కోసం వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఏమైనా ముట్టిందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి వుంది.

ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌లోని సీనియర్ పరిశోధకుడు, వ్యవస్థీకృత నేరాలపై నిపుణులు మార్టిన్ ఈవీ .ఈ విడుదల ప్రక్రియలో వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సాధారణంగా ఆఫ్రికాలోని కొన్ని ముఠాలు ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసి డబ్బు గుంజుతూ వుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube