మొటిమలను తగ్గించుకోవటానికి సమర్ధవంతమైన నిమ్మ ఫేస్ పాక్స్  

4 Lemon Face Masks For Pimples, Acne Scars -

మొటిమల కోసం అనేక రకాల క్రీమ్స్ ఉపయోగించి విసిగిపోయారా? అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి.ఇప్పుడు మొటిమల నివారణకు నిమ్మతో తయారుచేసే ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

1.నిమ్మరసం మరియు పెరుగు ఫేస్ ప్యాక్

కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.

4 Lemon Face Masks For Pimples, Acne Scars-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

2.నిమ్మకాయ మరియు గుడ్డు తెల్లసొన ప్యాక్

ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మూడు బాగాలుగా చేయాలి.

ఈ మిశ్రమంలో ఒక బాగాన్ని ముఖానికి రాసి ఐదు నిముషాలు అయ్యాక రెండో బాగాన్ని రాసి మరో ఐదు నిముషాలు అయ్యాక మూడో బాగాన్ని రాయాలి.మూడో పొర ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

3.నిమ్మకాయ రసం మరియు తేనే

ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.

4.నిమ్మరసం

తాజా నిమ్మరసంలో ఒక కాటన్ బాల్ ముంచి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక సాదారణ నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన మరియు మెరిసే చర్మం మన సొంతం అవుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు