Canada British Columbia govt : కెనడా : బ్రిటీష్ కొలంబియా కేబినెట్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులు..!!

కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

 4 Indian Origin Leaders Inducted As Ministers In Canada’s British Columbia Gov-TeluguStop.com

అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు బ్రిటీష్ కొలంబియాలోని ఎన్డీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చోటు దక్కించుకున్నారు.

కొత్త మంత్రులు విక్టోరియాలో ప్రమాణ స్వీకారం చేశారు.బ్రిటీష్ కొలంబియా కేబినెట్‌లో మంత్రులుగా స్థానం సంపాదించిన వారిలో జగ్రూప్ బ్రార్, హ్యారీ బెయిన్స్, రచనా సింగ్, రవి కహ్లోన్‌లు వున్నారు.

వీరంతా పంజాబీ మూలాలున్న వారే.అలాగే మరో భారత సంతతికి చెందని నిక్కీ శర్మ అటార్నీ జనరల్‌గా నియమితులవ్వడం విశేషం.

వీరిలో జగ్రూప్ బ్రార్ పంజాబ్‌లోని భటిండా నగరానికి సమీపంలోని డియోన్ గ్రామంలో జన్మించారు.బ్రిటీష్ కొలంబియాలోని సర్రే పనోరమా రిడ్జ్ నియోజకవర్గం నుంచి బ్రార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Telugu Canada, Harry Bains, Indian Origin, Indians, Jagrup Brar, Ndp, Rachna Sin

ఇక ఇటీవల జరిగిన అంటారియో ప్రావిన్స్ ఎన్నికల్లోనూ ఇండో కెనడియన్లు రాణించిన సంగతి తెలిసిందే.రెండవసారి అంటారియో ప్రీమియర్‌గా గెలిచిన డౌగ్‌ఫోర్డ్‌ ఈసారి తన కేబినెట్‌లో ఇద్దరు ఇండో కెనడియన్లకు కీలక మంత్రి పదవులను కట్టబెట్టారు.చిన్న వ్యాపారాలు, రెడ్ టేప్ తగ్గింపు శాఖ అసోసియేట్ మినిస్టర్‌గా , ట్రెజరీ బోర్డు అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన ప్రభమీత్ సర్కారియా‌కు మళ్లీ అదే పోస్ట్‌ను ఇచ్చారు.దీనితో పాటు సప్లై అంటారియో, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలు కూడా ప్రభమీత్ చేతుల్లోకి వచ్చాయి.

ఇక డౌగ్‌ఫోర్డ్‌ కేబినెట్‌లో మంత్రి పదవి పొందిన మరో వ్యక్తి పర్మ్ గిల్.ఈయన రెడ్ టేప్ తగ్గింపు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.గిల్.2021లో పౌరసత్వ, బహుళ సాంస్కృతిక మంత్రిగా పనిచేశారు.మిల్టన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన.2011-15 సమయంలో బ్రాంప్టన్ – స్ప్రింగ్‌డేల్‌ నుంచి ప్రాతినిథ్యం వహించారు.ఎంపీగా, వెటరన్ వ్యవహారాల మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శిగా, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా ఇలా పలు హోదాల్లో పర్మ్ గిల్ పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube