4కోట్లతో టోకరా పెట్టిన చిట్టీల వ్యాపారి..! లబోదిబోమంటున్న బాధితులు

4కోట్లలో టోకరా పెట్టిన చిట్టీల వ్యాపారి.! లబోదిబోమంటున్న బాధితులువిజయవాడ  సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో ప్రైవేట్ చిట్టీల వ్యాపారి సెనగల బాలాజీ పెద్ద సంఖ్యలో చీటీదారలకు,  అప్పు ఇచ్చిన వారికి టోకరా వేసాడు.

 4 Crore Basket Maker ..! Labodibomantunna Victims, Chitti , Chitti Business , E-TeluguStop.com

కోట్లలో  డబ్బులు తీసుకుని ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించడం లేదని బాధితులు చెబుతున్నారు.చిట్టీల వ్యాపారం తో పాటు జనం వద్ద నుంచి పెద్ద మొత్తంలో అప్పులు చేసుకుని పరారయ్యాడు.

గత కొద్ది రోజులుగా అతను కనిపించకపోవడంతో అతను ఫోను స్విచ్ ఆఫ్, అందుబాటులో లేకపోవడంతో బాధితులు కంగుతిన్నారు.మంగళవారం శ్రీనగర్ కాలనీలోని ఒకటో వీధిలో బాలాజీ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బాధితులు చేరుకున్నారు అక్కడ ఆయన లేకపోతే ఒకసారి అదే ఇంట్లో వేరే వాళ్ళు ఉండటంతో బాధితులు ఆందోళనకు దిగారు.

40 సంవత్సరాలుగా లోనే ఉంటున్నాడని చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటాడని అందరితో కలిసిపోతాడని నమ్మకం అప్పు ఇచ్చామని స్థానికులు చెబుతున్నారు.కొంతమంది విశ్రాంత ఉద్యోగులు సైతం అతడికి అప్పుగా డబ్బులు వడ్డీకి ఇచ్చారు అందరూ.

వడ్డీ సక్రమంగా చెల్లించేవాడు అయితే రెండేళ్లుగా సరిగ్గా కట్టడం లేదు.విద్యాసాగర్ అనే వ్యక్తి 25 లక్షల నగదు బాలాజీ కి వడ్డీకే ఇచ్చారు, మరో వ్యక్తి 20 లక్షలు, ఓ మహిళ 10 లక్షలు ఇచ్చారు.

వీరందరికీ  ఏడాదిన్నరగా వడ్డీలు చెల్లించకపోవడంతో అసలైన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.రేపు మాపు అంటూ వారికి మభ్యపెట్టిన   బాలాజీ నెల 16 నుంచి కనిపించడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

బాలాజీతో పాటు అతడి కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో తమను మోసం చేసి వెళ్లి పోయి ఉండవచ్చు బాధితులు ఆందోళన చెందుతున్నారు.మొత్తం అందరికీ సుమారుగా నాలుగు కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు దీనిిిపై సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube