భారత్ లో కరోనాపై విస్తృత పరిశోధనలు.. ఒకేసారి నాలుగు  

4 Corona Vaccines Covid 19 Indian Government - Telugu 4 Corona Vaccines May Soon Enter Clinical Trial Stage In India, Corona Effect, Covid-19, Indian Government, Lock Down

ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పెద్ద యుద్ధం చేస్తుంది.కనిపించే శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం ఉంటుంది.

 4 Corona Vaccines Covid 19 Indian Government

కాని కనిపించని శత్రువు వైరస్ రూపంలో విస్పోటనం సృష్టిస్తూ ఉంటే దీనిని ఎదుర్కోవడం ఎలా అనేదానిపై అన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు.సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు.

ప్రపంచ దేశాలలో ఏ దేశం ముందుగా కరోనా వాక్సిన్ తయారు చేస్తే ఆ దేశం స్థాయి అమాంతం పెరిగిపోతుంది.ప్రపంచం అంతా ఆ దేశం వైపు చూస్తాయి.

భారత్ లో కరోనాపై విస్తృత పరిశోధనలు.. ఒకేసారి నాలుగు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి అగ్ర రాజ్యాలతో పాటు భారత్ కూడా ఎదురుచూస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతానికి 100 కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి.

వాటిలో భారత్ కు చెందిన 14 కరోనా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.వాటిలో 4 వ్యాక్సిన్లు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని, త్వరలోనే వాటిని క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకెళుతున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఆ వ్యాక్సిన్లను వివిధ వయసులున్న మనుషులపై ప్రయోగిస్తారని, ఆపై వచ్చే ఫలితాల ఆధారంగా వాటి పురోగతి ఆధారపడి ఉంటుందని వివరించారు.రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.

ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ వచ్చేసరికి సుదీర్ఘ సమయం పడుతుందని హర్షవర్ధన్ తెలిపారు.ఓ వ్యాక్సిన్ అన్నివిధాలా సిద్ధం కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.

వాక్సిన్ వచ్చేంత వరకు కేవలం స్వీయ రక్షణ నుంచి మాత్రమే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

4 Corona Vaccines Covid 19 Indian Government Related Telugu News,Photos/Pics,Images..

footer-test