మహేష్ కోసం నలుగురు భామల రికమండేషన్

వరుస ఫ్లాపులు పడ్డా, రికార్డు స్థాయి డిజార్డర్స్ పడ్డా, మహేష్ బాబు బ్రాండ్ వాల్యూలో మాత్రం పెద్ద తేడాలేమి కనబడటం లేదు.భరత్ అనే బిజినెస్ లెక్కలు మళ్ళీ రికార్డు స్థాయిలోనే ఉండబోతున్నాయి.

 4 Beauties Using Recommendation For Mahesh Babu-TeluguStop.com

మహేష్ బాబు పారితోషికం కూడా మళ్ళీ రికార్డు స్థాయిలోనే ఉండబోతోంది.ఇక డైరెక్టర్స్ ఎప్పటిలాగే డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రిన్స్ తో జోడి కట్టాలని హీరోయిన్లు రికమండేషన్ మోసుకొస్తూనే ఉన్నారు.

మహేష్ బాబు 25వ సినిమా అంచనాలకు భిన్నంగా వంశీ పైడిపల్లి చేతిలో పడింది.25వ సినిమా అంటే రాజమౌళి తోనో, శంకర్ తోనో లేక త్రివిక్రమ్ తోనో ఉంటుంది అనుకున్నారు అంతా.కాని ఊపిరి లాంటి క్లాసిక్ తనకూ ఇస్తాడనే నమ్మకం కావచ్చు, వంశీ పైడిపల్లి దగ్గరికి వెళ్ళింది సినిమా‌.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తేలడం లేదు‌.హీరోయిన్ ఛాన్స్ కోసం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు భామలు రికమండేషన్ ఉపయోగిస్తున్నారు.ఆ నలుగురు ఎవరో, ఎవరి రికమండేషన్ వాడుతున్నారో చూడండి.

రకుల్ ప్రీత్ పనితనం మహేష్ కి నచ్చిందట.

సెట్ కి టైమ్ కి రావడం, డేట్స్ విషయంలో ఇబ్బంది పెట్టకపోవడం రకుల్ లో ఉన్న ప్లస్ పాయింట్స్.దాంతో స్పైడర్ భామనే తన 25వ సినిమాలో తీసుకుందామని స్వయంగా మహేష్ భావిస్తున్నాడు‌.

ఇక డీజే-దువ్వాడ జగన్నాథంలో తన అందచందాలతో యువతని అలరించిన పూజ హెగ్డే దిల్ రాజుతో రికమండేషన్ చేయిస్తోంది.ఈ సినిమాకు కూడా ఆయనే కదా నిర్మాత.అవకాశాలు లేక ఖాలిగా ఉన్న శృతిహాసన్ వంశీ పైడిపల్లి తరఫు నుంచి ట్రై చేస్తోంది‌.శృతి మహేష్ తో చేసిన శ్రీమంతుడు, వంశీతో చేసిన ఎవడు రెండు సక్సెస్ సాధించాయి.

మరి సెంటిమెంట్ కోసం శృతి కోసం ఓటు వేసిన వేయొచ్చు.ఇక మహేష్ సతీమణి నమ్రతా రికమండేషన్ తో ఓ బాలివుడ్ బ్యూటి కూడా ప్రయత్నాల్లో ఉందట‌.

మహేష్ బాబు అంటే ఆ రెంజ్ మరి‌.ఎంతైనా అందం + స్టార్ డమ్ కలిసిన అరుదైన కలబోత కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube