వైరల్: ఆ హోటల్ లో నలుగురికి 38 లక్షల బిల్లు..?!

సాధారణంగా మనం ఫ్యామిలీతోనే లేదంటే స్నేహితులతోనే ఏదన్నా హోటల్ కి గాని రెస్టారెంట్ కి గాని వెళ్ళినప్పుడు మహా అయితే ఒక పదివేలు లేదంటే 50 వేలు బిల్ అవుతుంది కదా.కానీ లండన్ లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్తే మాత్రం లక్షల రూపాయల్లో బిల్లు వాచిపోతుంది మరి.

 38 Lakh Bill For Four People In That Hotel .expensive Bill, London Restaurant, S-TeluguStop.com

అందుకే అంటారు తినే ముందు మనం తినే ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత ఉందో తెలుసుకుని తినమని.తీరా అవేవి చూడకుండా బిల్ సంగతి తరువాత ముందు కడుపునిండా తిందాము అనుకుంటే ఇలాగే బిల్ లక్షల్లో వస్తుందని ఈ నలుగురు వ్యక్తులను చూసాక గాని అర్ధం అవ్వదు.

తాజాగా ఓ నలుగురు వ్యక్తులు శుక్రవారం నైట్స్‌ బ్రిడ్జ్‌ లోని నస్ర్-ఎట్ స్టీక్‌హౌస్‌కు వెళ్లగా ఇలాంటి పరిణామమే ఎదురయింది.అన్ని తినేసాక బిల్ చూస్తే కంటతడి ఒక్కటే తక్కువ అని చెప్పాలి.ఎందుకంటే ఆ రెస్టారెంట్ వారు వీరికి 37,023.10 బిల్లు వేసింది.అంటే సుమారు 38 లక్షల రూపాయలన్నమాట.ఇందులో దాదాపు రూ.5 లక్షల వరకు సర్వీస్ చార్జీలు ఉన్నాయట.ఆ కస్టమర్లు ఆ రెస్టారెంట్ బిల్లు ఫొటోను రెడిట్ లో షేర్ చేయగా ఆ బిల్లు ఫోటో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

వామ్మో అంత బిల్లు వేశారెంటి అని రెస్టారెంట్ నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సదరు వ్యక్తులు వెళ్లిన రెస్టారెంట్ ని సాల్ట్ బే అనే ఓ ప్రముఖ టర్కీష్ చెఫ్ ఇటీవల లండన్ లో ఏర్పాటు చేశాడు.

టర్కీకి చెందిన ఇతడు తన రెస్టారెంట్లలో రకరకాల ఐటమ్స్ ను చాలా స్టైలిష్ గా తయారు చేయడంతో పాటు లక్షల్లో బిల్లులు కూడా వసూలు చేస్తూ ఉంటాడు.అంతేకాకుండా ఈ చెఫ్ కి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

అలాంటి వ్యక్తి నడుపుతున్న రెస్టారెంట్ లోకి ఈ నలుగురు కస్టమర్లు వెళ్లి పదుల సంఖ్యలో ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారు.అందులో బంగారపు పూత తయారుచేసిన ఓ తోమాహాక్‌ ఆర్డర్ చేసారు.

దాని ధర 850 పౌండ్లు.అలాగే 600 పౌండ్ల ఖరీదైన 20 బక్లావాలను, 9100 పౌండ్ల విలువైన 1996 పెట్రస్ బాటిల్స్ పాటు రెండు పెట్రస్ వింటేజ్ బాటిల్స్ కూడా తీసుకున్నారు.

Telugu Expensive, Restaurant, Salt Bae-Latest News - Telugu

ఒక్కో బాటిల్ ధర 9950 పౌండ్లు అంట.అలాగే మరో రెండు ఖరీదైన పానీయాలు ఆర్డర్ చేశారు.ఆర్డర్ ఇచ్చే ముందు రేట్స్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఆర్డర్ చేసేసారు.ఎంచక్కా లాగించేసారు.ఆ తరువాత బిల్ చూసి మనోళ్ళకి చెమటలు పట్టడం మొదలయ్యి ఉంటాయి.ఎందుకంటే మొత్తం బిల్ 38 లక్షలు అయింది కాబట్టి.

అవి చూసి షాక్ అయ్యారు.కానీ ఆ రెస్టారెంట్ లో అన్ని ఖరీదైనవే.

తోమాహాక్ స్టీక్ 630 పౌండ్ల, బంగారు బర్గర్ 100 పౌండ్ల, ఓ కోకాకోలా లైట్ ధర 18, స్వీట్ కార్న్ 12 పౌండ్ల ఇలా ప్రతిదీ కూడా టూ మచ్ కాస్ట్ అంట.రెస్టారెంట్ వేసిన రేట్స్ వారు షేర్ చేసిన బిల్లులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.మొత్తంగా 32,194 పౌండ్లు ఫుడ్ ఐటమ్స్ కి ఛార్జ్ చేయగా, మళ్ళీ అదనంగా 4,829 పౌండ్లు సర్వీస్ ఛార్జ్ కూడా వేశారు.ఈ బిల్ చూసి నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు.

సంవత్సరం పాటు కష్టపడినా ఇంత డబ్బు సంపాదించాలేమో అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube