ఇటలీ: భారతీయుడిని చితక్కొట్టిన తోటి ఇండియన్స్.. దెబ్బలు తాళలేక..!!

ఇటలీలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనవరి 25న విసెంజా ప్రావిన్స్‌లోని అర్జిగ్నానోలో జరిగింది.37 ఏళ్ల బాధితుడిని మరో ఇద్దరు భారతీయులు దారుణంగా చితకబాదారు.ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.రాత్రి 10.30 గంటలకు స్థానిక కర్మాగారం వెలుపల వీధిలో రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని ఓ బాటసారి కనుగొన్నాడు.దీంతో వెంటనే స్పందించిన ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.అయితే తీవ్ర గాయాల కారణంగా అతను కొద్దిసేపటికే మరణించాడు.అతని తలపై లోతైన గాయం మరణానికి కారణం కావొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

 37 Year Old Indian Man Brutally Beaten To Death In Italy, Italy, Viral News, Arj-TeluguStop.com

భారత సంతతికి చెందిన నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు.

గొడవకు కొద్దిసేపటి క్రితం ముగ్గురూ పీకలదాకా తాగినట్లు పోలీసులు సీసీటీవీలో గుర్తించారు.గొడవ జరగడానికి దారి తీసిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.పేరు తెలియని బాధితుడిపై మద్యపానంతో పాటు కర్ఫ్యూ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను గతంలో కేసు నమోదైంది.ఇటలీలో రాత్రి 10.00 తర్వాత ప్రజలు రోడ్ల మీదకు రావడాన్ని పోలీసులు నిషేధించారు.

Telugu Arjignano, Indian, Italy-Telugu NRI

బాధితుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇటలీకి వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు.అతను నిరాశ్రయుడు కావడంతో ఇతర భారతీయులతో కలిసి ఒక కార్‌వాన్‌లో నివసిస్తున్నాడు.అతని ప్రమాదకర పరిస్ధితి, మీతిమిరిన మద్యపానం కారణంగా అధికారులు అతనిని భారతదేశానికి బహిష్కరించాలని భావించారు.అయితే ఇటలీలో కోవిడ్ సంక్షోభం కారణంగా ఈ బహిష్కరణను పోలీసులు వాయిదా వేశారు.

యూరప్‌లో యూకే తర్వాత ఇటలీలోనే భారతీయులు పెద్ద సంఖ్యలో వున్నారు.

కాగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో.

ఇటలీలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలు అమలు చేసింది ఇటలీ.

పబ్లిక్‌ హాలీడే సమయాల్లోనూ దేశంలో రెడ్‌ జోన్‌ ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.షాపులు, రెస్టారెంట్లు, బార్లను మూసివేశారు.

కేవలం ఆఫీసుకు వెళ్లేవారికి మాత్రమే ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube