గడిచిన 12 ఏళ్లుగా రోజుకి కేవలం అర్ధగంట మాత్రమే నిద్ర..?!

నిద్ర అంటే ఎవరికి ఇష్టం ఉండదు.ఉరుకులు పరుగులతో గడిచిపోయే జీవితంలో ప్రతి ఒక్కరు నిద్రకు ప్రాముఖ్యత ఇస్తారు.

 36 Years Japanese Dausuke Hori Sleeping Only 30 Minutes From 12 Years, Sleeping,-TeluguStop.com

ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, కష్టపడి పని చేసేవాళ్ళు, ఏ కాస్త సమయం దొరికినా.ఒక కునుకు తీద్దామని అనుకుంటూ ఉంటారు.

కొందరైతే ఏకంగా నిద్రపోవడమే తమ పనిగా పెట్టుకుంటారు.బాగా నిద్ర పోవడం వల్ల అలసిపోయిన శరీరానికి కాస్త ఊరట లభిస్తుంది.

తిరిగి చురుగ్గా పని చేయడానికి శక్తినిస్తుంది.రోజు కి కనీసం7 లేదా 8 గంటలు నిద్రపోవాలన్నది నియమం.

అలాంటిది రోజు కి అర్ధ గంట మాత్రమే నిద్రపోతే ఎలా ఉంటుంది.అసలు ఏ పని చేయలేము కదా.కానీ ఓ వ్యక్తి 12 ఏళ్లుగా రోజుకి అర్ధ గంట మాత్రమే నిద్రపోతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.ఇంతకీ ఎవరీ వ్యక్తి తెలుసుకోవాలనుందా.

అయితే ఈ కథ చదివేయండి.

జపాన్ కు చెందిన 36 ఏళ్ల డైసుకే హోరి అనే వ్యక్తి ” డైసుకే జపాన్ షార్ట్ స్లీప్ అసోసియేషన్ చైర్మన్.

ఈయన దాదాపు 12 ఏళ్లుగా కేవలం అర్ధ గంట అంటే 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాడంట.అలా నిద్రపోవడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా ఉంటానని, అసలు ఏ మాత్రం అలసట అనిపించదని చెప్తున్నాడు.

దీనికి తోడు రోజు అర్ధ గంట నిద్రపోవ డానికి తనకు తాను శిక్షణ పొందుతున్నాడంట.అలాగే తన లాగే ఇతరులకు కూడా తక్కువ సమయం నిద్రపోయేందుకు శిక్షణ కూడా ఇస్తున్నాడంట.

ఈ విషయం గురించి తాను మాట్లాడుతూ ప్రజలు తాము అనుకున్న పనులను సమయం లేకపోవడంతో చేయలేక పోతున్నారని , దీంతో తక్కువ నిద్రపోవడం వల్ల ఆ పనులు చేస్కోవచ్చునని అన్నారు.ఈ కారణంగానే తాను కూడా రోజుకి అర్ధ గంట అంటే కేవలం 30 నిముషాలు మాత్రమే నిద్రపోయేలా శిక్షణ తీస్కున్నాడంట.

అయితే ఈ విషయం జపాన్ మీడియాలో రావడంతో అందరూ ఆశ్చర్య పోయారు.

Telugu Dausuke Hori, Japanese, Latest, Minutes-Latest News - Telugu

అక్కడి స్థానిక న్యూస్ ఛానెల్ కూడా డైసుకే దావా గురించి ప్రత్యేక కార్యక్రమం కూడా చేసిందట.అయినా డైసుకే చెప్తోంది నిజమో కాదో తెలుసు కోవడానికి మూడు రోజుల పాటు ఛానెల్ వాళ్ళతో నాన్ స్టాప్ గా కెమెరాల మధ్య గడిపాడు.ఆ సమయంలో డైసుకే కేవలం 26 నుంచి 30 నిమిషాల పాటు నిద్రపోయి, అలారం లేకుండా మేల్కొవడం జరిగిందంట.

అందుకే తాను నిద్ర మేల్కొడానికి తక్కువ గా నిద్ర పోవడానికి ఎక్కువ గా కాఫీ తాగేవాడంట.కాఫీ తాగడం వల్ల అందులో ఉన్న కెఫిన్ నిద్ర రాకుండా సాయ పడుతుందట.

ఆసక్తి కరమైన విషయం ఏంటంటే డైసుకే స్నేహితులు కూడా తక్కువ నిద్రపోతున్నారని ఆ ఛానల్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube