పెళ్లి చేసుకొమ్మని ఆంటీ పోరు పెడుతుందని.. యువకుడు దారుణంగా....

ఈమధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఇతరుల ప్రాణాలు సైతం తీయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు తాజాగా ఓ యువకుడు 35 సంవత్సరాలు కలిగినటువంటి ఓ ఆంటీ ప్రేమలో పడి చివరికి ఆమె పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టడంతో దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగు చూసింది.

 35 Years Old Woman Brutally Killed In Mumbai For Illegal Affair-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే రాణి (పేరు మార్చాం) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.

అయితే  రాణి గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యతో బాధ పడుతోంది.దీంతో గత కొద్ది రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు తీసుకుంటోంది.

 35 Years Old Woman Brutally Killed In Mumbai For Illegal Affair-పెళ్లి చేసుకొమ్మని ఆంటీ పోరు పెడుతుందని.. యువకుడు దారుణంగా….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో పని చేస్తున్నటువంటి వికాస్ అనే వార్డ్ బాయ్ తో పరిచయం ఏర్పడింది.కాగా చాలా తొందరగానే వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

కానీ అప్పటికే వికాస్ కి వేరే యువతితో పెళ్లయింది.కానీ రాణి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా తన పెళ్ళి విషయాన్ని దాచి పెట్టాడు.

ఈ విషయం తెలియనటువంటి రాణి తన సర్వస్వాన్ని వికాస్ కి అర్పించింది.దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడు రాణి ఇంట్లో కామ క్రీడలలో మునిగితేలే వాళ్ళు.కాగా గత కొద్ది రోజులుగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని వికాస్ పై ఒత్తిడి తెస్తోంది.దీంతో ఎలాగైనా రాణి పీడ విరగడ చేసుకోవాలని వికాస్ పన్నాగం పన్నాడు.

ఈ క్రమంలో పలు చెడు డ్రగ్స్ ని ఉపయోగించి ఆమెని హతమార్చాలని ప్లాన్ వేసాడు.దీంతో అనుకున్న విధంగానే నీతో మాట్లాడాలని ఉందని రాణి ని పిలిపించి ఆమెకు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ ఎక్కించాడు.

దీంతో రాణి అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం రాణి మృతదేహాన్ని స్థానిక ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతంలో విసిరేశాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా వికాస్ ని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలను కనుగొన్నారు.

#Illegal Affair #35Years #WomanBrutally #Mumbai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు