35 లక్షల జీతంతో ఒక జాబ్‌... పనేంటో తెలిస్తే వెంటనే మీరూ దరఖాస్తు చేస్తారు  

35 Lakhs Salary Job-enjoy,interesting,job,life,rich People,salary,world Tour

 • డబ్బులుంటే ఏదైనా చేయవచ్చు, ఏం చేసినా చెల్లుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున డబ్బున్న వారు చేస్తున్న పనులు, వారు కొన్ని ఖర్చులు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి.

 • 35 లక్షల జీతంతో ఒక జాబ్‌... పనేంటో తెలిస్తే వెంటనే మీరూ దరఖాస్తు చేస్తారు-35 Lakhs Salary Job

 • ముఖ్యంగా డబ్బున్న వారు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తారు.

 • తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త మాథ్యూ లెప్రె జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇరవై ఏళ్ల పాటు కష్టపడి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఇకపై వ్యాపారాన్ని పక్కన పెట్టి వరల్డ్‌ టూర్‌కు సిద్దం అయ్యాడు.

 • ఒంటరిగా వరల్డ్‌ టూర్‌ వెళ్లడం కష్టంగా భావించిన ఆ ధనవంతుడు తనకు తోడుగా ఒక వ్యక్తిని తీసుకు వెళ్లాలని భావిస్తున్నాడు. అందుకోసం సంవత్సరంకు 36 లక్షల జీతంను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ప్రయాణ ఖర్చులు అన్ని తానే పెట్టుకోవడంతో పాటు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఇంకా ఇతర అదనపు డబ్బులు కూడా ఇస్తానంటూ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

 • తనకు కావాల్సిన వ్యక్తి ఎంపిక చేసుకునేందుకు మాథ్యూ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు.

  35 Lakhs Salary Job-Enjoy Interesting Job Life Rich People Salary World Tour

  ఇంత మంచి జాబ్‌ ఆఫర్‌ను ఆయన ప్రకటించడంతో కేవలం రెండు రోజుల్లోనే 50 వేల మంది ధరకాస్తు చేసుకున్నారు. దరకాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం అమ్మాయిలు ఉండటం, అది కూడా 30 ఏళ్ల లోపు వారు ఎంతో మంది ఉండటం గమనార్హం. చూడ్డాని బాగున్నాడు, డేటింగ్‌ కూడా చేసినట్లుగా ఉంటుందని ఎంతో మంది అమ్మాయిలు ఆయనతో వరల్డ్‌ టూర్‌ చేసే జాబ్‌కు ఆసక్తి చూపుతున్నాడు.

 • అయితే ఇంత మంది లోంచి మాథ్యూ ఎలా, ఎవరికి ఎంపిక చేసుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.