బీచ్‌ ఒడ్డున 35 అడుగుల భారీ తిమింగలం... చూడడానికి జనాలు క్యూ కడుతున్నారు!

ఆ బీచ్ పేరు లిడో బీచ్‌.న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలోని లాంగ్ ఐలాండ్‌లోని వున్న ఈ బీచ్ పలు విషయాలకు ప్రసిద్ధి.

 35 Feet Huge Whale On The Beach. People Are Queuing To See It Beach, Beach Shore-TeluguStop.com

చాలామంది పర్యాటకులు ఇక్కడికి వెళుతూ వుంటారు.ఇక తాజాగా ఈ లిడో బీచ్‌లో 35 అడుగుల పొడవున్న మగ హంప్‌బ్యాక్ తిమింగలాన్ని అధికారులు గుర్తించడం జరిగింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ 10 సంవత్సరాలలో వారు చూసిన అతిపెద్ద తిమింగలం ఇదేనని హెంప్‌స్టెడ్ పట్టణ పర్యవేక్షకుడు అయినటువంటి డాన్ క్లావిన్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం చూసి కనీసం ఐదేళ్లు అయిందన్నారు.

Telugu Beach, Beach Shore, Don Clavin, Lido Beach, York, Whale-Latest News - Tel

కాగా ఇపుడు బీచ్ కి కొట్టుకొచ్చిన తిమింగలం చనిపోయిందని వెల్లడించారు.డిసెంబరు నుంచి ఇప్పటి వరకుUS తీరానికి దాదాపు 14 తిమింగలాలుకొట్టుకొచ్చినట్టు సమాచారం.దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.కొంతమంది స్థానిక అధికారులు, పర్యావరణవేత్తలు ఈ ప్రాంతంలో ఆఫ్‌షోర్ విండ్ ఫామ్‌ను అభివృద్ధి చేయడమే ఈ మరణాలకు కారణమని BBC ఓ నివేదికలో ఆరోపించింది.

అయితే అందుకు గల ఆధారాలు మాత్రం లభించలేదని అధికారులు చెప్పడం కొసమెరుపు.

Telugu Beach, Beach Shore, Don Clavin, Lido Beach, York, Whale-Latest News - Tel

ఇక గత 6 ఏళ్ళనుండి చనిపోయిన తిమింగలాలకు సంబంధించిన సమాచారాన్ని NOAA(నేషనల్ ఓషనోగ్రాఫిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) సేకరిస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఫ్లోరిడా నుండి మైనే వరకు 178 చనిపోయిన హంప్‌బ్యాక్ తిమింగలాలను వారు సేకరించారు.ఇందులో కొన్ని తిమింగలాలకు శవపరీక్షలు జరపగా వాటిలో 40% మరణాలు ఫిషింగ్ గేర్‌లో చిక్కుకోవడం లేదా ఓడలు ఢీ కొట్టడం వల్ల, మానవ పరస్పర చర్య వల్ల సంభవించాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube