34 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన లారీ.. ఇప్పుడు బయటపడింది..! ఎలాగో తెలుసా.?  

34 Samvatsarala Kritham Kottuku Poyina Lorry Bayatapadindhi -

34 ఏళ్ల కిందట గల్లంతైన లారీ ఇటీవల ఇసుక తవ్వకాల్లో బయటపడింది.ఆ లారీతో పాటు మూడు మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి.

ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

34 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన లారీ.. ఇప్పుడు బయటపడింది.. ఎలాగో తెలుసా.-General-Telugu-Telugu Tollywood Photo Image

కరీంనగర్ జిల్లాలో 1984న భారీ వర్షాలకు వరదలు వచ్చాయి.జూలై 23న దుర్శేడు గ్రామంలో ఉన్న ఇరుకుల్ల వాగు పాత వంతెనపై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.ఆ సమయంలోనే శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన ఓ లారీ ఇరుకుల్ల వంతెన దాటుతుండగా నీటి ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయింది.

లారీలో ఉన్న నలుగురు గల్లంతయ్యారు.ఇందులో ఒకరి మృతదేహం అప్పుడే నాలుగు కిలో మీటర్ల దూరంలో దొరికింది.ఆ తర్వాత లారీ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇటీవల వాగులో జరిగిన తవ్వకాల్లో.

లారీ బయటపడిందనే సమాచారం తెలియగానే కేశవపట్నంలో ఉంటున్న మృతుల కుటుంబ సభ్యులు గురువారం తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ను కలిశారు.వాగులో నుంచి లారీని తవ్వి తీసేందుకు అనుమతి కోరారు.

ఈ సందర్భంగా లభ్యమైన అవశేషాలు కేశవపట్నానికి చెందిన దౌలత్ ఖాన్, ముగ్దుంఖాన్, కరీంనగర్‌కు చెందిన కటికె శంకర్‌‌వి గుర్తించారు.దౌలత్ ఖాన్, ముగ్దుం ఖాన్ సోదరులని, వీరు అప్పట్లో పశువులు వ్యాపారం చేసేవారిని బంధువులు తెలిపారు.

ప్రమాదం జరిగిన రోజున వీరిద్దరూ సొంత లారీలో పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.ఆ లారీలో ఇద్దరు సోదరులతో పాటు కరీంనగర్‌కు చెందిన కటికె శంకర్, వెంకటస్వామి అనే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపారు.

అప్పట్లో వారి గురించి గాలించినా ఆచూకీ లభించలేదని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు