తూర్పు గోదావరి జిల్లాలో 33 మంది గ్రామ వాలంటీర్లు తొలగింపు..!

ఏపీలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా ఉన్నారు గ్రామ వాలంటీర్లు.అలాంటి గ్రామ వాలంటీర్లు తమ విధులను సరిగా నిర్వర్తించకపోవడంపై వారిపై వేటు వేశారు.

 33 Village Volunteers Terminated In Ap, 33 Village Volunteers, Andrapradesh, Ap,-TeluguStop.com

తూర్పు గోదావరి జిల్లాలో విధులను సక్రమంగా నిర్వహించని గ్రామ వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది.జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించారు.

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఫీవర్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో జ్వరం లేని వారికి కూడా ఉన్నట్టుగ ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేశారు గ్రామ వాలంటీర్లు.

ఆ ఆరోపణలతో వీరిపై వేటు వేశారు.ఆ గ్రామ వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

వారు ఇచ్చిన రిపోర్ట్ ల మీద ఫీవర్ సర్వే ఆధారపడి ఉండగా ఆన్ లైన్ లో ఫీవర్ లేని వారికి కూడా ఉందన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడంతో గ్రామ వాలంటీర్ల మీద వేటు వేశారు.విధుల నుండి తొలగించబడ్డ వాలంటీర్లు కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, రాజమండ్రి అర్బన్, తుని, రాజోలు, అమలాపురం, మామిడికుదురు ప్రాంతాలకు చెందిన వారని సాచరం.

ఫీవర్ సర్వే తప్పుడు రిపోర్ట్లని తెలిసిన అనతరం వెంటనే జాయింట్ కలెక్టర్ 33 మందిని విధుల నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube