వ్యాక్సిన్లు దొంగల పాలు.. జైపూర్ హాస్పిటల్ లో 320 కోవిడ్ టీకాలు మాయం..!

కరోనా టైం లో కూడా దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు.ఇప్పుడు కూడా తమ దొంగతనాలతో పోలీసులకు పని కల్పిస్తున్నారు.

 320 Doses Of Covid Vaccine Stolen By Someone At Jaipur Hospital-TeluguStop.com

జైపూర్ లో ఓ హాస్పిటల్ లో విచిత్రంగా కరోనా వ్యాక్సిన్లు దొంగిలించారట.జైపూర్ శాస్త్రి నగర్ లో కాన్వాటియా హాస్పిటల్ లో 320 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కనిపించకుండా పోయిందట.

హాస్పిటల్ మొత్తం వెతికినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే వ్యాక్సిన్లు ఎలా మిస్ అయ్యాయి.

 320 Doses Of Covid Vaccine Stolen By Someone At Jaipur Hospital-వ్యాక్సిన్లు దొంగల పాలు.. జైపూర్ హాస్పిటల్ లో 320 కోవిడ్ టీకాలు మాయం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటిని ఎవరు అక్కడ నుండి మాయం చేశారన్న దాని మీద విచారణ జరుగుతుంది.ఓ పక్క వ్యాక్సిన్ల కొరత ప్రజలను ఇబ్బంది పెడుతుంటే హాస్పిటల్ నుండి కరోనా టీకాలు మాయమవడం హాట్ న్యూస్ గా మారింది.

ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత ఉంది.అసలు అవి బయటకు ఎలా వెళ్లాయన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా టైం లో ఏవి కొట్టేయాలో తెలియక దొంగలు వ్యాక్సిన్ల మీద పడ్డారని చెప్పొచ్చు.అసలు దొంగలు ఆ వ్యాక్సిన్లు ఎందుకు అపహరించారు.వారికి వ్యాక్సిన్ల ఇన్ ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు.అసలు వ్యాక్సినలు దొంగలించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది దర్యాప్తులో తేలుతుంది.

హాస్పిటల్ లో పెట్టిన వ్యాక్సిన్లు కనిపించకపోవడంతో ఆ హాస్పిటల్ సిబ్బందిపై వైద్య అధికారులు సీరియస్ గా ఉన్నారు.విచారణలో పోలీసు వారికి సహకరించారని కోరారు.

వైద్య అధికారుల అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

#Covid Vaccine #Corona Vaccine #Jaipur Hospital #320 Doses #Stolen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు