యూఎస్ కిడ్స్ గోల్ఫ్ కి....32 మంది భారతీయ చిన్నారులు..!!

ఎంతో మంది భారతీయ చిన్నారులు వివిధ దేశాలలో నిర్వహించే స్పెల్ బీ , పరిశోధన రంగాలు, క్రీడా రంగాలలో సత్తా చాటి అందరిని ఆశ్చర్య పరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి.తమ చక్కని ప్రతిభతో ఎనలేని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

 32 Indian Kids Selected For Us Kids Golf-TeluguStop.com

తాజాగా క్రీడా విభాగంలో భారత్ కి చెందినా 32 మంది చిన్నారులు గోల్ఫ్ క్రీడలో తమ సత్తా చాటారు.యూరప్ లో నిర్వహించనున్న యూఎస్ కిడ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోవారందరూ పాల్గొనబోతున్నారు.


ఈ పోటీలకి వయసుల వారీ బృందాలుగా విడగొట్టిన ఈ 32 మందిలో 20 మంది అబ్బాయిలు కాగా 12 మంది అమ్మాయిలు ఉన్నారు.ప్రతీ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొనే ఛాంపియన్ షిప్ లో పాల్గొనాలంటే ఇలా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్ధులకి తెలిపారు వారిని పదును పెడుతున్న కోచ్ లు

ఇదిలాఉంటే ఈ పిల్లాల్లో చాలా మంది మొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆడటంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారని కోచ్ లు తెలిపారు.

ఇలాంటి పిల్లలను ప్రపంచస్థాయి ఆటగాళ్ళ పక్కన చేర్చడం తమ ధ్యేయమని చిన్నతనం నుంచీ వీరిలో ప్రతిభని సానపెడితే తప్పకుండా వీరిలో ఉన్న ప్రతిభ ఉన్నత స్థానాలకి వీరిని చేర్చుతుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube