ఢిల్లీ హాస్పిటల్ లో 32 మంది డాక్టర్స్ కు కరోనా పాజిటివ్..!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తుంది.రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

 32 Doctors Tested Positive For Covid Aims Dhilli, 32 Doctors Corona,  Aims Dhill-TeluguStop.com

మొన్నటిదాకా వందల్లో ఉన్న కేసులు కాస్తా ఇప్పుడు వేలల్లో పెరుగుతున్నాయి.కరోనా బాధితులకు చికిత్స అందించే ప్రధాన హాస్పిటల్స్ మళ్లీ కిటకిటలాడనున్నాయి.

ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున వైద్యులకు కరోనా టెస్టులు నిర్వహించారు.ఢిల్లీలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో 32 మంది వైద్యులకు కరోనా వచ్చినట్టు సమాచారం.

ఒకరిద్దరికి కాదు ఏకంగా 32 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తుంది.

డాక్టర్లతో పాటు మరో 30 మంది హెల్త్ వర్కర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది.

కేసులు ఎక్కువవుతున్న ఈ నేపథ్యంలొ ఎయిమ్స్ లో కేవలం అత్యవసర సర్జరీలు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు.సాధారణ చికిత్సలు ఉండవని పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఇలానే ఉంటుందని చెబుతున్నారు.

ఇక కరోనా బారిన పడిన వారంతా క్వారంటైన్ లో ఉన్నారని ఎయిమ్స్ తెలిపింది.ఢిల్లీలో గంగా రామ్ హాస్పిటల్ లో కూడా వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

అక్కడ కూడా 37 మంది డాక్టర్స్ కు కరోనా పాజిటివ్ అని తేలిదట.అక్కడ డాక్టర్స్ లో ఎక్కువమంది యువకులు ఉన్నట్టు తెలుస్తుంది.32 మంది హోం క్వారంటైన్ లో ఉండగా ఐదుగురు మాత్రం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్టు తెలుస్తుంది.ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వైద్య అధికారులతో మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube