లండన్‌లో భారతీయ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి మృతురాలి కుమారుడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే… వెస్ట్ లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్ పరిధిలో గల డ్రూ గార్డెన్స్‌లో నివాసిస్తున్న హన్సా పటేల్ (62) బుధవారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవంగా తేలారు.
సమాచారం అందుకున్న పోలీసులు.ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఆమె తలపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి వుంటారని ప్రాథమికంగా నిర్థారించారు.
కానీ అక్కడ క్రైమ్ సీన్ చూస్తే మాత్రం ఎవరో దుండగుడు వచ్చి హతమార్చినట్లుగా అనిపించడం లేదు.
ఇదే సమయంలో ఇంట్లో తల్లి హన్సా పటేల్, ఆమె కుమారుడు షానిల్ పటేల్ మాత్రమే వున్నారు.దీంతో పోలీసుల కళ్లు అతనిపై పడ్డాయి.వెంటనే షానిల్ను అదుపులోకి తీసుకుని.ప్రాథమిక విచారణ అనంతరం హత్య కేసు నమోదు చేశారు.
శుక్రవారం లండన్‌లోని వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టులో షానిల్ను హాజరుపరిచారు.ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో వుంది.
ఇక ఉమ్మి వేశాడన్న ఆక్రోశంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన నేరంపై గుర్జీత్ సింగ్ లాల్(36) అనే భారతీయుడిని బ్రిటన్ కోర్టు గత నెలలో దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.ఇతనికి డిసెంబర్ 14న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.2019 ఆగస్టు 24న మాజీ రగ్బీ ఆటగాడైన అలన్ ఇసిచీ(69) పబ్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చాడు.అదే సమయంలో గుర్జీత్ సింగ్ తన ఇంటివైపు రావడం చూసిన అలన్… ఉమ్మివేయడం గమనించాడు.
దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.మాటా మాటా పెరిగి గుర్జీత్ తన వద్ద ఉన్న కత్తితో అలన్‌పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన అలన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.విచారణలో గుర్జీత్ ఆత్మరక్షణలో భాగంగానే తాను అలన్‌పై దాడి చేసినట్లు అంగీకరించాడు.
అయితే ఒక ప్రాణం పోవడానికి కారణమైనందున న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది.