తమిళనాట కలకలం.... నది తీరంలో పడి ఉన్న ఆధార్ కార్డులు....

ఆధార్ కార్డు ని అన్నిటికీ లింక్ చేసి, దేశ వ్యాప్తంగా ఎక్కడకి వెళ్లిన కేవలం ఆధార్ సాయం తో ఎలాంటి ఇన్ఫర్ మేషన్ అయినా కూడా పొందొచ్చు.ఈ ఆధార్ గురించి గతంలో తీవ్ర చర్చలు కూడా జరిగాయి.

 3000 Aadhaar Cards Found Dumped On Riverbank In Tamil Nadu-TeluguStop.com

ఆధార్ ని అన్నిటికీ అనుసంధానం చేస్తే హ్యాక్ చేస్తారు అంటూ పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అలాంటి ఆధార్ కార్డు లు ఒక నది తీరంలో పడి ఉన్న ఘటన తమిళనాట తీవ్ర కలకలం సృష్టించింది.

తిరుప్పూరు జిల్లా తిరుత్తురైపూండి వద్ద ముళ్లియారు నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటుండగా వారికి పెద్ద సంఖ్యలో(మూడు వేలకు పైగా) ఆధార్ కార్డులు కనిపించడం తో ఆ చిన్నారులు స్థానికులకు తెలియజేశారు.దీనితో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దీనితో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు నది తీరానికి చేరుకొగా ఆ స్థలంలో కొన్ని సంచుల నిండా ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు.దీనితో అక్కడ ఉన్న ఆధార్ కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఆ ఆధార్ కార్డులు అన్నీ కూడా కట్టిమేడు, అతిరంగం, వడపట్టి గ్రామాల ప్రజలకు చెందినవని అధికారులు భావిస్తున్నారు.అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలు ఆధార్ కార్డులు ఎవరివి,అక్కడకు ఎలా వచ్చి చేరాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube