చేతులు కాల్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ  

30 Years Prudhvi Missed Role In Ala Vaikuntapuramulo-ala Vaikuntapuramulo,allu Arjun,harshavardhan,prudhvi,trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

30 Years Prudhvi Missed Role In Ala Vaikuntapuramulo-ala Vaikuntapuramulo,allu Arjun,harshavardhan,prudhvi,trivikram-Telugu Gossips 30 Years Prudhvi Missed Role In Ala Vaikuntapuramulo-ala Vaikuntapur-30 Years Prudhvi Missed Role In Ala Vaikuntapuramulo-Ala Vaikuntapuramulo Allu Arjun Harshavardhan Prudhvi Trivikram

కాగా ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది.కాగా ఈ సినిమాలో ఓ పాత్రను చేయాల్సి థర్టీ ఇయర్స్ పృథ్వీ తన రాజకీయ కామెంట్ల కారణంగా ఆ పాత్రను వదులుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమాలో కమెడియన్ హర్షవర్ధన్ చేసిన పాత్రను తొలుత థర్టీ ఇయర్స్ పృథ్వీతో చేయించాలని చూశారట త్రివిక్రమ్.కానీ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్‌పై పలు విమర్శలు చేయడంతో ఆయన్ను తప్పించారట మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

దీంతో మరో కమెడియన హర్షవర్ధన్‌కు ఈ పాత్ర దక్కడం, దానిని ఆయన పూర్తిగా వినియోగించుకుని మంచి గుర్తింపు సాధించడం జరిగింది.

పొలిటికల్ పరంగానూ థర్టీ ఇయర్స్ పృథ్వీకి చేదు అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే.

ఇటీవల ఆయన ఆడియో టేప్ లీక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఆడియో టేప్ లీక్ వల్ల ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

మరి థర్టీ ఇయర్స్ పృథ్వీ సినిమా అవకాశాలకు చెక్ పడినట్లేనా అనే సందేహం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

30 Years Prudhvi Missed Role In Ala Vaikuntapuramulo-ala Vaikuntapuramulo,allu Arjun,harshavardhan,prudhvi,trivikram Related....