నేటి ఆధునిక కాలంలో ముప్పై ఏళ్లు దాటాయంటే.శరీరంలో, ముఖంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే అనేక అనారోగ్య సమస్యలు కూడా మొదలు అవుతాయి.ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి, కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలతో పాటు ముఖంపై ముడతలు, సన్నని చారలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాయి.
అందుకే ముప్పై ఏళ్లు దాటాయంటే..
ఆరోగ్యంపై మరియు చర్మంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యం కోసం తాజాగా కూరగాయలు, పండ్లు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తృణధాన్యాలు, నట్స్, గుడ్లు వంటి డైట్‌లో చేర్చుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్‌ను ఏ మాత్రం స్కిన్ చేయకూడదు.ఇక షుగర్ ఫుడ్స్, మైదా పిండి, నిల్వ చేసిన పచ్చళ్లు, నిల్వచేసిన సూప్ లు, వైట్ రైస్, ప్రాసెస్డ్ మీట్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, సోడాలు, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, కొవ్వు తియ్యని పాలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వయసు పైబడుతున్న కొద్ది.శరీరంలో కాల్షియం తగ్గి ఎముకలు పెలుసుబారిపోతుంటాయి.అందుకే ప్రతి రోజు కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవాలి.ఇక డిటాక్స్ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.వీటి వాల్ల శరీరంలో వ్యార్థాలు బయటకు పోవడంతో పాటు.
చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.ఫలితంగా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
వయసు పైబడే కొద్ది.అన్ని పోషకాలు ఉండే ఆహరం తీసుకోవడమే కాదు.
ఆ ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారం అయ్యుండాలి.
ముప్పై ఏళ్లు దాటాయంటే.
ముడుతలు మరియు ఇతర చర్మ సమస్యలు ప్రారంభం అవ్వడాన్ని గమనించవచ్చు.అయితే వీటిని నివారించడంలో గ్రీన్ టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.
వాస్తవానికి గ్రీన్ టీ వెయిట్ లాస్‌కు మాత్రమే కాదు.ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది కూడా.
అందువల్ల రెగ్యులర్ కప్పు గ్రీన్ టీని తీసుకుంటే.ముఖంపై ముడతలు, సన్నని గీతలు పోయి తక్కువ వయస్సు ఉన్న వారుగా కనబడుతారు.
ఇక వీటితో పాటు ప్రతి రోజు వ్యాయామం, యోగా వంటి చేస్తే ఆరోగ్యంగా, అందంగా ఉండొచ్చు.