యాంకర్ ప్రదీప్ సినిమా ఓటీటీకే ఫిక్స్ అయ్యింది

తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఇమేజ్ తో నెంబర్ వన్ హోస్ట్ గా కొనసాగుతున్న వ్యక్తి యాంకర్ ప్రదీప్.యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 30 Rojullo Preminchadam Ela Release Date On Ott-TeluguStop.com

అతను చేస్తున్న షోలే అతనికున్న క్రేజ్ ని చెబుతాయి.ఇక ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసి నెంబర్ వన్ హోస్ట్ గా మారిన ప్రదీప్ అప్పుడప్పుడు సినిమాలలో కూడా చిన్న చితకా పాత్రలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉన్నాడు.

అయితే హీరోగా మొదటి సారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు.సుకుమార్ శిష్యుడు మున్నా ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

 30 Rojullo Preminchadam Ela Release Date On Ott-యాంకర్ ప్రదీప్ సినిమా ఓటీటీకే ఫిక్స్ అయ్యింది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే అమృత అయ్యర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.రిలీజ్ కి ముందే ఈ సినిమా నుంచి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సెన్సేషన్ హిట్ అయ్యింది.

యుట్యూబ్ లో ఏకంగా రెండు వందల మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా రికార్డులు క్రియేట్ చేసింది.

దీంతో ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ చేద్దామని అనుకునే సమయానికి కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ పడటంతో రిలీజ్ వాయిదా పడిపోయింది.సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు ఎదురు చూసారు.

సినిమాకి ఉన్న క్రేజ్ కారణంగా సూపర్ హిట్ అవుతుందని, మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు.అయితే డిసెంబర్ లో థియేటర్లు ఓపెన్ చేసిన జనవరి నుంచి పెద్ద సినిమాలు వరుసగా పడుతున్నాయి.

వాటితో పోటీగా రిలీజ్ చేస్తే తట్టుకోవడం కష్టం.ఈ నేపధ్యంలో కచ్చితంగా మరో నాలుగు నెలల పాటు సినిమాని వాయిదా వేయాలి.

ఈ నేపధ్యంలో నిర్మాతలు తప్పని సరి పరిస్థితిలో ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

#Television #Anchor Pradeep #30Rojullo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు