ప్రదీప్‌ మ్యానియా మరీ ఈ రేంజ్‌లో ఉందేటి గురూ?  

30 Rojullo Preminchadam Ela Pradeep - Telugu 30 Rojullo Preminchadam Ela, Ala Vaikuntapuramlo, Coronavirus, Neeli Neeli Akasham , Pradeep, Tollywood, S

తెలుగు బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ప్రదీప్‌కు పేరు ఉంది.ఆయన అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు.

 30 Rojullo Preminchadam Ela Pradeep

ముఖ్యంగా లేడీస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండే ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.గతంలో పలు సినిమాల్లో నటించినా కూడా మొదటి సారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సమ్మర్‌ ఆరంభంలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

ప్రదీప్‌ మ్యానియా మరీ ఈ రేంజ్‌లో ఉందేటి గురూ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దాదాపు నాలుగు నెలల క్రితం విడుదల అయిన ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట యూట్యూబ్‌లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తూనే ఉంది.తక్కువ సమయంలోనే 100 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకున్న ఈ పాట తాజాగా మరో అరుదైన మైలు రాయిని చేరేందుకు సిద్దంగా ఉంది.150 మిలియన్‌ మార్క్‌కు అతి చేరువలో ఉంది.నేడో రేపో ఆ మార్క్‌ కూడా చేరడం ఖాయం అంటున్నారు.సినిమా విడుదలకు ముందే పాట 200 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.

సినిమా విడుదల కాకుండా ఒక చిన్న సినిమా పాటకు ఈ రేంజ్‌లో వ్యూస్‌ రావడం అనేది నిజంగా చాలా పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు.ఇటీవల కాలంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాయి.ఆ తర్వాత ప్రదీప్‌ తన రేంజ్‌ను యూట్యూబ్‌లో పాట ద్వారా చూపిస్తున్నాడు.మొత్తానికి నీలి నీలి ఆకాశం పాటతో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

30 Rojullo Preminchadam Ela Pradeep Related Telugu News,Photos/Pics,Images..

footer-test