ఆమెతో యాంకర్ ప్రదీప్ లిప్ లాక్.. హిట్ గ్యారంటీ..?  

30 rojullo preminchadam ela movie trailer review, 30 rojullo preminchadam ela , anchor pradeep, anoop rubens, pradeep liplock with amritha aiyer, amritha aiyer, - Telugu 30 Rojullo Preminchadam Ela, 30 Rojullo Preminchadam Ela Movie Trailer Review, Amritha Aiyer, Amrutha Nair, Anchor Pradeep, Anoop Rubens, Pradeep Liplock With Amritha Aiyer, Pradeep Machiraju, Trailer Review

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.నీలి నీలి ఆకాశం పాటతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలైంది.

TeluguStop.com - 30 Rojullo Preminchadam Ela Movie Trailer Review

పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ట్రైలర్ లో ఈ జనరేషన్ ప్రేమ కథనే ఎక్కువగా చూపించారు.

ప్రదీప్ కాలేజ్ కుర్రాడి పాత్రలో, గ్రామీణ యువకుడి పాత్రలో ఈ సినిమాలో నటించారు.ట్రైలర్ లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి.ఈ సినిమాలో ప్రదీప్ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో కూడా నటించారు.వినోదానికి ఢోకా లేకుండా సమయానుకూలంగా పంచ్ లు సినిమాలో వేసినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - ఆమెతో యాంకర్ ప్రదీప్ లిప్ లాక్.. హిట్ గ్యారంటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడే హీరో హీరోయిన్ 30 రోజుల్లో ప్రేమించుకోవాలని ఎలా ప్రేమించుకుంటారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ట్రైలర్ లో యూత్ కు నచ్చే అన్ని అంశాలు ఉండటంతో విడుదలకు ముందే ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాకు మున్నా డైరెక్టర్ గా వ్యవహరించగా కన్నడ ప్రొడ్యూసర్ ఎస్వీ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ నెల 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో యువి / గీతా సంస్థలు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.

ఈ సినిమాతో ప్రదీప్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది.

అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా సినిమాలోని అన్ని పాటలు హిట్టయ్యాయి.పోసాని కృష్ణమురళి, హైపర్ ఆది, వైవా హర్ష, ఇతర కమెడియన్లు ఈ సినిమాలో నటించారు.

#Trailer Review #30Rojullo #Amrutha Nair #Amritha Aiyer #Anchor Pradeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు