రిపబ్లిక్‌ డే సందర్బంగా ప్రదీప్‌ సినిమా

ఈ ఏడాది ఆరంభంలో విడుదల అవ్వాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ పేరున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవ్వబోతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను సమ్మర్‌ లో విడుదల చేయాలనుకున్నారు.

 30 Rojullo Preminchadam Ela Movie For January 26th ,30 Rojullo Preminchadam Ela,-TeluguStop.com

కాని కరోనా కారణంగా ప్రమోషన్‌ మొదలు పెట్టి కూడా విడుదల చేయలేక పోయారు.కరోనా కారణంగా థియేటర్లు ఆలస్యం అవ్వడంతో సినిమాను ఓటీటీకి అమ్మేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

కాని ప్రదీప్ మొదటి సినిమా అవ్వడంతో పాటు సినిమాపై క్రేజ్‌ ఆకాశాన్ని తాకేలా ఉంది.అంచనాలు అందుకుంటామనే నమ్మకం కూడా ఉండటంతో సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

సినిమా థియేటర్లు ప్రారంభం అయ్యాయి.నేడు సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమా కూడా వచ్చింది.

కనుక సినిమా థియేటర్లలోనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాలు క్యూ కట్టాయి.

కనుక సంక్రాంతికి పోటీ పడటం కంటే ఆ తర్వాత విడుదల చేయడం బెటర్‌ అన్నట్లుగా నిర్ణయానికి వచ్చారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా చాలా విభిన్నమైన ప్రేమ కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

రికార్డు స్థాయిలో ఈ సినిమాను థియేటర్ల ద్వారానే విడుదల చేయాలని భావిస్తున్నారు.ప్రస్తుతం సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి.

కనుక వాటి పలితాన్ని బట్టి కూడా సినిమాలు విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల అయితే కలెక్షన్స్‌ పరిస్థితి ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube