ఆ బ్లాక్ బస్టర్ మూవీని సమంత రిజెక్ట్ చేశారా..?

ప్రదీప్, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో ఫణి ప్రదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.పెట్టుబడితో పోలిస్తే భారీగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 30 Rojullo Preiminchadam Ela Director Comments About Samantha-TeluguStop.com

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ మొదట సమంతకు వచ్చిందని కొన్ని కారణాల వల్ల సమంత ఈ సినిమాలో నటించే ఆఫర్ ను వదులుకున్నారని తెలుస్తోంది.

Telugu 30 Rojullo Preminchadam Ela, Pradeep, Samantha, Samantha Rejected-Movie

ఈ సినిమా డైరెక్టర్ ఫణి ప్రదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడగా ఈ పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

 30 Rojullo Preiminchadam Ela Director Comments About Samantha-ఆ బ్లాక్ బస్టర్ మూవీని సమంత రిజెక్ట్ చేశారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను సమంత మేనేజర్ ను కలిసి కథ వినిపించానని సమంత మేనేజర్ కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారని ఫణి ప్రదీప్ అన్నారు.

Telugu 30 Rojullo Preminchadam Ela, Pradeep, Samantha, Samantha Rejected-Movie

30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథ సమంతకు బాగా నచ్చిందని అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల సమంత ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఫణి ప్రదీప్ చెప్పుకొచ్చారు.సమంత ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే హీరో కోసం కూడా తాను ప్రయత్నాలు చేసేవాడినని ఫణి ప్రదీప్ వ్లెలడించారు.ఆ తర్వాత ప్రదీప్ హీరోగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా ఎంపిక కావడం జరిగిందని ఫణి ప్రదీప్ తెలిపారు.

తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 30 రోజులో ప్రేమించడం ఎలా రిలీజ్ కాగా ఓటీటీలో ఈ సినిమాకు భారీగా వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది.థియేటర్లలో విడుదలైన మూడు నెలల తరువాత ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం గమనార్హం.

#Pradeep #30Rojullo #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు