వయసులో ఉన్నాం కాబట్టి గుండె జబ్బులు రావు అనుకోవద్దు

ఒకప్పుడు గుండె సంబంధిత వ్యాధులు అంటే, 40,50 ఏళ్ళు దాటితే వచ్చేవి.యువతీయువకులకు ఏదో లోపం ఉంటే తప్ప, గుండెకి జబ్బులు రావడం ఎక్కువగా చూసేవాళ్ళం కాదు.

 30% Heart Disease Cases Are From 20-40 Years Of Age-TeluguStop.com

కాని ఇప్పుడలా కాదు.లైఫ్ స్టయిల్ మారిపోయింది.

తినే తిండి మారిపోయింది.నిద్రపోయే సమయాలు మారిపోయాయి.

ఇప్పుడు వయసులో ఉన్నవారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

కొత్తగా జరిగిన రిసెర్చ్ లో తేలిందేంటంటే, గుండెజబ్బలతో బాధపడేవారిలో 30% మంది 20-40 ఏళ్ళలో ఉన్నవారే అంట.ఇకనుంచి గుండె సమస్యలు ముసలితనంలోనే వస్తాయనుకుంటే చాలా పెద్ద పొరపాటు అని, వయసులో ఉన్నవారికి కూడా గుండె సంబంధిత వచ్చే అవకాశాలు చాలా పెరిగాయని హెచ్చరించారు డాక్టర్లు.

దీన్ని నుంచి తప్పించుకోవాలంటే యువత ఆహారపు అలవాట్లు మార్చుకోని, దినచర్యలు సరిగా ప్లాన్ చేసుకోని, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ స్ట్రెస్ దరిచేరకుండా జాగ్రత్తపడాలి.

అలాగే షుగర్ లెవెల్స్, కొలస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.ఇక కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని, సోడియం, కొలస్ట్రాల్ ఎక్కువగా లేని అహార పదార్థాలను తినాలి.

అంతే కాకుండా, మద్యపానం, పొగత్రాగడం లాంటి అలవాట్లను పూర్తిగా దూరంగా పెట్టాలి.అప్పుడే గుండెజబ్బులకు దూరంగా ఉండగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube