అరగంటసేపు అదరగొట్టనున్న బాలయ్య

30 Minutes Very Crucial In Balakrishna Movie

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభిచుకున్న సంగతి తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 30 Minutes Very Crucial In Balakrishna Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి పాత్రల్లో నటిస్తాడా అనే విషయంపై చిత్ర యూనిట్ గతంలోనే క్లారిటీ ఇచ్చేసింది.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

 30 Minutes Very Crucial In Balakrishna Movie-అరగంటసేపు అదరగొట్టనున్న బాలయ్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైతుగా నటించే పాత్రకు సంబంధించిన టీజర్‌ను మనకు చూపించారు చిత్ర యూనిట్.ఇక మరో పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు.

అయితే బాలయ్య ఈ సినిమాలో అఘోరాగా ఎందుకు కనిపిస్తాడనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.కాగా ఈ సినిమాలోని సెకండాఫ్‌లో ఈ అఘోరా పాత్ర ఉంటుందని, అందులో భాగంగా 30 నిమిషాలపాటు ఈ పాత్ర అదరగొడుతుందని చిత్ర యూనిట్ అంటోంది.

మొత్తానికి బాలయ్య చేయబోయే అఘోరా పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.మరి ఈ పాత్రలో బాలయ్య ఎలా కనిపిస్తాడా అనేది చూడాలి.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ముంబైకు చెందిన ఓ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

#Balakrishna #Boyapati Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube