బాహుబలి 2 సినిమా అరగంట ఇంటర్నెట్ లో లీక్

సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న లీకేజ్ భూతం మరోసారి తన దెబ్బ వేసింది.ఈసారి కూడా నష్టం బాహుబలికే జరిగింది.

 30 Mins Of Baahubali 2 Leaked Online-TeluguStop.com

పవన్ అత్తారింటికి దారేది ఫస్టాఫ్ మొత్తం లీక్ అవడం అప్పట్లో ఓ పెద్ద సంచలనం.ఆ తరువాత బాహుబలికి సంబంధించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగక ముందే లీక్ అయ్యాయి.

బాహుబలి 2 కి అదే పరిస్థితి.మొదట ప్రభాస్ అనుష్కలు ఉన్న కొన్ని కీలక సన్నివేశాలు లీక్ కాగా, ఆ తరువాత బాహుబలి 2 ట్రైలర్ కూడా లీక్ అయ్యింది.

ఇక నిన్న రాత్రి ఊహించని విధంగా బాహుబలికి సంబంధించిన నాలుగైదు సన్నివేశాలు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి.

కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాలు, క్లయిమాక్స్ సన్నివేశాలు కూడా ఈ లీకేజ్ బారిన పడటం నిర్మాతలను కలవరపెడుతోంది.

అటు ఇటు కలిపి కనీసం ఓ అరగంట సినిమా బయటకి వచ్చింది అని టాక్.అదే నిజమైతే నిజంగా ఇది దారుణం.

అసలు ఎక్కడ తప్పు జరుగుతోందో అర్థం కావడం లేదు, పదే పదే బాహుబలికే ఇలా ఎందుకు జరుగుతుందో ! రెండోవ భాగానికి 200 కోట్లకు పైగా ఖర్చుపెట్టారు.సినిమా 350 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది.

అంతా వందల కోట్ల వ్యవహారం .ఇలాంటి కండిషన్స్ లో ఇలాంటి లీకేజ్ సినిమాని దేబ్బెతీసేదే.

అసలే ఐపిఎల్ సీజన్ నడుస్తోంది.జనాలు సాయంత్రం టీవిలకు అతుక్కుపోతున్నారు.ఈ లీకేజ్ ని, ఐపిఎల్ ని దాటుకొని బాహుబలి ఎంత వెనకేసుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube