“30 లక్షలమంది” భారతీయులకి “సౌదీ” షాక్       2018-05-02   00:27:24  IST  Bhanu C

ఎంతో మంది భారతీయులు తమ దేశాన్ని విడిచి పెట్టి ఎక్కువ డబ్బు సపాదించేందుకు ఇతర దేశాలకి వెళ్తూ ఉంటారు..కొంతమంది చదువుల నిమ్మిత్తం వెళ్తే మరికోతమంది ఉన్నతమైన ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారు..అయితే అధికశాతం మంది కూలీలుగా వెళ్తూ ఉంటారు..మరి కొతమంది మోసపోతూ ఉంటారు..అయితే

ఈ మధ్యకాలంలో అమెరికా లాంటి అగ్రదేశాలు భారతీయుల మీద పెడుతున్న వీసా నిభందనలు ఎంతో మంది భారతీయులని వెనక్కి రప్పిస్తున్నాయి..ఈ కోవలోకే సౌదీ కూడా తన వ్యుహాలని అమలు చేస్తోంది..అందుకు తగ్గట్టుగానే భారతీయులపై ఉక్కుపాదం మోపుతోంది..వివరాలలోకి వెళ్తే..

ఇటీవలి కాలంలో భారతీయులకు సౌదీలో ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. సౌదీలో బయటి నుంచి వచ్చేవారికి 12 రంగాల్లో ఉద్యోగాలు ఇవ్వటాన్ని నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది..దాంతో 30 లక్షలమంది భారతీయులపై ప్రభావం పడనుంది…ఎందుకంటే సౌదీ అరేబియా ప్రభుత్వం విజన్- 2030 దిశగా పనిచేస్తోంది..అందులో భాగంగానే వారి దేశ ప్రజలకి స్థానిక ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

దీనిలో భాగంగా ఫెర్ఫ్యూమ్స్, దుస్తులు, బ్యాగ్స్, చెప్పులు తదితర దుకాణాలలో స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదేశాలు జారీ చేశారు..దాంతో ఎంతో మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు.