ఆయన మీసం తిప్పితే రికార్డ్ లు.తొడగొడితే రికార్డ్ లు .
తొడగొట్టి ట్రైన్లను ఆపాలన్నా.నేటి తరం హీరోలతో పోటీ పడుతూ మామ ఎక్ పెగ్ లా అన్నా ఆయనకే చెల్లింది.
పాత్ర ఏదైనా.కథ ఎలాంటిదైనా ఆ కథలోకి వెళ్లి పూర్తిగా న్యాయం చేయగలిగిన అతికొద్ది హీరోల్లో నందమూరి బాలకృష్ణ.
తనతండ్రి విశ్వవిఖ్యాత నటుడు స్వర్గియ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలయ్య.తనకంటూ ఓ గుడ్ విల్ ను సంపాదించుకున్నారు.
తండ్రి పేరు చెప్పి సినిమాలు చేసేకంటే తనలోని టాలెంట్ ను మాత్రమే గుర్తిస్తూ సినిమాలు చేయడమే తనకిష్టమంటారు.14ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల అనే చిత్రంలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి నటసింహాం .ఆ తరువాత దానవీరసూరకర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలీ, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం చిత్రాల్లో యాక్ట్ చేశారు.
హీరోగా సాహాసమే జీవితం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.నాటి నుంచి మొదలైన నట ప్రస్థానం నిర్విరామంగా, నిరంతర ప్రాయంగా కొనసాగుతుంది.46ఏళ్ల సినీ కెరియర్ లో 100కి పైగా నటించి రికార్డ్ లు సృష్టించారు.ముఖ్యంగా ఆయన నటించిన చిత్రాల్లో భైరవద్వీపం, నరసింహనాయుడు,సమరసింహారెడ్డి,ఆదిత్య 369 ఇలా ఎన్నో సినిమాలకు రికార్డ్ లు ఆయనకు దాసోహమయ్యాయి.
భైరవద్వీపానికి ఫిల్మిం ఫేర్, నరసింహనాయుడు, సింహాకు నంది అవార్డ్, నరసింహనాయుడు బెస్ట్ యాక్టర్ అవార్డ్, లెజెండ్ సినిమాకు ఉత్తమ కథనాయకుడు అవార్డ్ లు దక్కాయి.కానీ తానెప్పుడు అవార్డ్ ల కోసం సినిమాలు చేయడం లేదని, నటనతో తన అభిమానుల్ని సంతోషపెట్టేందుకు సినిమాలు చేస్తున్నట్లు మీసం మెలేసి చెబుతారు బాలయ్య బాబు.
46ఏళ్ల కెరియర్ లో 100పైగా చిత్రాలు చేయడం చాలా చిన్న విషయమని, ఇంటర్ తరువాత చదువుపై ఇంట్రస్ట్ లేక, ఆ విషయం తండ్రి ఎన్టీఆర్ కు చెప్పే దైర్యం లేక.మెడిసిన్ ఎంట్రన్స్ రాసి, ఆ తరువాత మూడేళ్ల డిగ్రీ చేయడంతో ఎన్నోసినిమాలు మిస్సయ్యాయని చెబుతారు.ఆ మూడేళ్ల డిగ్రీలేకపోతే ఇప్పటికి 250సినిమాలు దాటేవని గర్వంగా చెబుతారని ఈ నందమూరి నటసింహం బాలకృష్ణ.