టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి  

3 Nris Killed In Road Accident Texas - Telugu , Frisco, Nri, Road Accident, Telugu Nri News, Texas

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు.టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో పట్టణంలోని ఫార్మ్‌ టు మార్కెట్ రోడ్ 423పై డెల్ వెబ్ బౌలే‌వార్డ్ జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం 6.40కి ఈ ప్రమాదం జరిగింది.
అతి వేగంగా వస్తున్న కారు భారతీయులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

3 Nris Killed In Road Accident Texas

మరణించిన వారిని దివ్య ఆవుల, రాజా గవిని, ప్రేమ్‌నాథ్ రామనాథం‌గా గుర్తించారు.ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారును నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.వీరు ముగ్గురు ప్రిస్కోలోనే నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.మరిన్ని వివరాలకు 972-292-6010 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా ఫ్రిస్కో పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

3 Nris Killed In Road Accident Texas-frisco,nri,road Accident,telugu Nri News,texas Related....