ఊరిస్తున్న పవన్... కవరేజ్ పెంచిన ఛానెల్స్ !       2018-07-07   23:46:11  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య మీడియా తో సున్నం పెట్టుకున్నాడు. దాంతో పవన్ కు ఫుల్ కవరేజ్ ఇచ్చిన మీడియా అంత ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. పవన్ సభలు అన్నిటికి కవరేజ్ తగ్గించేసాయి. ఆ ఎఫెక్ట్ కారణంగా పవన్ కి అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో స్వయంగా పవన్ సొంత ఛానెల్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అయితే సొంత ఛానెల్ పెట్టడం కత్తిమీద సామే అని అర్ధం అవ్వడంతో ఇప్పటికే నడుస్తున్న ఏదైనా ఛానెల్ కొనుగోలు చేసి పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని పవన్ మైండ్ లో ఫిక్స్ అయ్యాడు.

పవన్ కల్యాణ్ తన సొంత చానల్ ప్రారంభించబోతున్నారని ప్రచారం బాగా జరిగింది. దానికి జే టీవీ అని పేరు పెట్టారని చెప్పుకున్నారు. కానీ తర్వాత 99 టీవీని కొనేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత జాబితాలోకి టెన్ టీవీ, విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఏపీ 24/7 కూడా పవన్ పెట్టుబడులు పెట్టే చానళ్ల జాబితాలో చేరాయి. రోజులు గడుస్తున్నాయి కానీ.. పవన్ కల్యాణ్ ఇంకా టీవీ చానల్‌పై నిర్ణయం మాత్రం తీసుకోలేదు.
కానీ పెట్టుబడులు పెడతారన్నఆశతో ఈ మూడు చానళ్లకు ఇప్పుడు పవన్ కల్యాణ్ కు విపరీతమైన కవరేజ్ ఇచ్చేస్తున్నాయి.

పవన్ కల్యాణ్ అడుగు బయటపెడితే.. అదే వార్త అవుతోంది. ప్రసంగిస్తే.. లైవ్ ఇచ్చేస్తున్నారు. పవన్ కల్యాణ్.. దుమ్ము రేపుతున్నాడని డిస్కషన్లు పెడుతున్నారు. ఓ చానల్ అయితే.. ఏకంగా …జనసేనకు మెజార్టీ సీట్లు కట్టబెడుతూ.. సర్వే చేసినంత పని చేసింది. దీనికి కారణం ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడో ఓవర్ ఫ్లో అయింది. ఇబ్బడిమబ్బడిగా వచ్చి పడిన చానళ్లు ఇప్పుడు మనుగడ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అందుకే ఎవరైనా కొంటారా.. కనీసం పెట్టుబడులు పెడతారా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ దశలో పవన్ మీదే ఆ మూడు ఛానెల్స్ ఆశలు పెట్టుకుని ఉన్నాయి. మరి పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.