సింగపూర్ బార్ పరీక్షల్లో చీటింగ్.. నిందితుల్లో ముగ్గురు భారతీయ ట్రైనీ లాయర్లు

2020లో సింగపూర్‌లో జరిగిన బార్ ఎగ్జామ్స్‌‌లో మోసం చేసిన ఆరుగురిలో ముగ్గురు భారత సంతతి ట్రైనీ లాయర్లు కూడా వున్నారని స్థానిక మీడియా బుధవారం నివేదించింది.

సింగపూర్ హైకోర్టు న్యాయమూర్తి చూ హాన్ టెక్ బుధవారం వారి పేర్లను సవరించాలన్న ఉత్తర్వును రద్దు చేసినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.

గత తీర్పులో పేర్కొన్న ఆరుగురు వ్యక్తులు మోనిషా దేవరాజ్, కుశాల్ అతుల్ షా, భారత సంతతికి చెందిన శ్రీరామ్ రవీంద్రన్, అలాగే చైనా సంతతికి చెందిన లిన్ క్యూక్ యి టింగ్, మాథ్యూ చౌ జున్ ఫెంగ్, లియోనెల్ వాంగ్ చూంగ్ యోంగ్.ఈ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనాన్ని అనుసరించి రీడక్షన్, సీలింగ్ ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా అటార్నీ జనరల్ చేసిన దరఖాస్తును తాను అనుమతించినట్లు జస్టిస్ చూ వెల్లడించారు.

గత వారం తన ప్రాథమిక తీర్పులో .జస్టిస్ చూ ఆరుగురు న్యాయవాదులు పరీక్షలలో మోసం చేసినట్లు తేలడంతో వారు దీర్ఘకాలంలో ఎలాంటి పక్షపాతానికి గురికాకూడదనే ఉద్దేశంతో వారి పేర్లను బహిర్గతం చేయలేదని చెప్పారు.ఐదుగురు ట్రైనీ లాయర్లు వాట్సాప్ ద్వారా ఆరు పరీక్ష పేపర్‌ల సమాధానాలను పంచుకున్నారు.

ఆరో వ్యక్తి మరో అభ్యర్ధితో కలిసి మూడు పేపర్లలో మోసం చేసినట్లు ఛానెల్ నివేదిక పేర్కొంది.ఐదుగురు ట్రైనీ లాయర్ల బార్ దరఖాస్తులకు ఆరు నెలలు, మరో ట్రైనీ లాయర్‌ దరఖాస్తును ఏడాది వాయిదా వేశారు న్యాయమూర్తి.

Advertisement

కాగా.సింగపూర్‌లో లా ప్రాక్టీస్ చేయడానికి.లా గ్రాడ్యుయేట్‌లు తప్పనిసరిగా పార్ట్ బీ అని పిలిచే పరీక్షల సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత బార్‌ కౌన్సిల్‌లో చేరేందుకు అనుమతి లభిస్తుంది.

అలాగే సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకున్న లా గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా పార్ట్ ఏ అని పిలిచే మరో పరీక్షకు హాజరు కావాలి.

Advertisement

తాజా వార్తలు