"ఒక" సినిమాకు..ముగ్గురు దర్శకులు!!!  

ఒక చిత్రాన్ని ఒక దర్శకుడు డైరెక్ట్ చేస్తేనే, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, అంతేకాకుండా ఒక్క దర్శకుడు అయితేనే ఆలోచించి..ఆచి తూచి సినిమాను తెరకెక్కిస్తాడు. అలాంటిది ఒక్క సినిమాకు ముగ్గురు దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందో తెలుసా…విషయం ఏమిటంటే తమిళ టాప్ హీరో అజిత్ తన తరువాత సినిమాను ముగ్గురూ దర్శకులు తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అజిత్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎన్నై అరిందాల్‌’ చిత్రానికి గౌతమ్ మీనన్ తో పాటు మరో ఇద్దరు దర్శకత్వం వహించినట్లు కోలీవుడ్ మీడియా టాక్. ముగ్గురు దర్శకత్వం వహించినట్లు తెలిసింది. ఈ చిత్రప్రధాన దర్శకుడు గౌతం మీనన్‌ అనుమతితో ఈసినిమాను త్వరగా పూర్తిచేయాలి అన్న ఉద్దేశ్యంతో కోలీవుడ్ డైరెక్టర్లు శ్రీధర్‌ రాఘవన్‌, త్యాగరాజ కుమారరాజలు కూడా ఈసినిమాకు పనిచేసారని వార్తలు వస్తున్నాయి. ఈసినిమా త్వరలో తెలుగులో కూడా ‘ఎంతవాడుగానీ’ అనే టైటిల్ తో డబ్ చేయబడి విడుదల అవుతోంది. ఇందులో హీరో అజిత్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నాడని టాక్. ఈసినిమాకు సంబంధించి ఈమధ్యనే విడుదలైన ఈ టీజర్ కు 10 లక్షల హిట్స్‌ రావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. మరి కారణాలు ఏమైనా ఒక్క సినిమాకు ముగ్గురు దర్శకులు దర్శకత్వం వహించడం విశేషం.