ఫేస్ బుక్ పోస్ట్ తో బెంగుళూరులో చెలరేగిన హింస... ముగ్గురు మృతి

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారుతున్నాయి.ఒక వర్గం లేదా పార్టీకి చెందిన వారు మరో వర్గాన్ని, పార్టీలో ప్రముఖులని కించపరిచే విధంగా పోస్టులు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 3 Die After Violence Erupts In Bangalore Over Controversial Post, Facebook Posti-TeluguStop.com

సోషల్ మీడియాలో ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటూ ఇష్టానుసారంగా యాంటీ పోస్టులు పెడుతూ పదే పదే ఒకరిని కించపరచడం చేస్తూ అదొక హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు.అయితే ఇలాంటి వాటికి ఈ మధ్య కాలంలో చట్టం అడ్డుకట్ట వేస్తుంది.

అయితే కొన్ని చోట్ల ఇలాంటి పోస్టుల కారణంగా వివాదం శ్రుతిమించి అల్లర్లుకి కారణం అవుతుంది.తాజాగా బెంగుళూరులో అలాంటి పరిస్థితి తలెత్తింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో ఒక మతాన్ని కించపరిచే విధంగా పోస్టు షేర్‌ చేశాడు.ఈ పోస్టు విషయంలో వివాదం రాజుకుని అల్లర్లకు దారి తీసింది.

అల్లర్లు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఆందోళన కారులు పోలీసుల వాహనాలకి నిప్పు పెట్టడంతో వారు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.మరో 60 మందికి గాయాలయ్యాయి.

ఈ కేసులో 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి తన వెనుక ఉన్నాడన్న ధైర్యంతోనే అతని మేనల్లుడు ఇలా కించపరిచే విధంగా పోస్టు చేశాడని ఆందోళన కారులు ఆరోపించారు.

ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న వాహనాలకు నిప్పంటించడంతో అతని ఇంటికి మంటలు అంటుకున్నాయి.ఆందోళన కారులని పోలీసులు చెదరగొట్టి ఈ వివాదానికి కారణం అయిన నవీన్‌ను అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube