వీధి కుక్కలకు అన్నం పెట్టినందుకు 3.5 లక్షల జరిమానా... ఆ నీచులను ఏమనాలో మీరే చెప్పండి  

3.5 Lakhs Fine For Feeding Street Dogs-3.5 Lakhs,colony,dogs,feeding,fine,general Telugu Updates,mumbai,street,water

 • కొన్ని సార్లు మానవత్వంతో ప్రవర్తిస్తే అందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మంచి కోసం చేస్తే కొన్ని సార్లు చెడు అవుతుంది.

 • వీధి కుక్కలకు అన్నం పెట్టినందుకు 3.5 లక్షల జరిమానా... ఆ నీచులను ఏమనాలో మీరే చెప్పండి-3.5 Lakhs Fine For Feeding Street Dogs

 • మూగ జీవాలు అని వాటికి సాయం చేయాలనుకున్న ఒక మహిళకు పెద్ద శిక్ష పడింది. ఆమె చేసిన పనిని మెచ్చుకోవాల్సింది పోయి అంతా కూడా ఆమెను నింధించారు.

 • ఆమెకు పలు దఫాలుగా ఫైన్‌ విధించారు. అయినా కూడా ఆమె తన మంచి తనంను చాటుకుంటూ వచ్చింది.

 • ముంబయికి చెందిన ఆమె కుక్కలకు అన్నం పెట్టడం వల్ల 3.5 లక్షల జరిమానా కట్టింది. పదే పదే ఆమె కుక్కలకు బోజనం పెట్టడం, ఆ తర్వాత మళ్లీ జరిమానా కట్టడం చేసింది.

  పూర్తి వివరాల్లోకి వెళ్తే…ముంబయిలోని నిసర్గ్‌ హెవెన్‌ సొసైటీలో నివసిస్తున్న నేహా దత్వానీ ప్రతి రోజు కాలనీలో ఉండే వీధి కుక్కలకు తన ఇంట్లో మిగిలి ఉన్న భోజనం పెట్టడంతో పాటు, వాటికి బిస్కట్స్‌, ఇంకా వాటికి తాగు నీరు కూడా పోస్తూ ఉంటుంది. దాంతో ఆ కుక్కలు సదరు సొసైటీ నుండి బయటకు పంపించేందుకు ప్రయత్నించినా కూడా వెళ్లడం లేదు.

 • స్థానికులు ఆ కుక్కలను పంపించేందుకు ఎంత ప్రయత్నించినా కూడా వెళ్లక పోవడంతో అంతా కూడా నేహా దత్వానీపై పడ్డారు. ఆమెను పదే పదే కుక్కలకు బోజనం పెట్టవద్దని సూచించారు.

 • 3.5 Lakhs Fine For Feeding Street Dogs-3.5 Colony Dogs Feeding Fine General Telugu Updates Mumbai Street Water

  కుక్కలకు బోజనం పెట్టినందుకు మొదట ఆమెకు 2,500 రూపాయల ఫైన్‌ విధించారు. ఆ తర్వాత మళ్లీ బోజనం పెట్టిందని ఫైన్‌ పెంచుతూ వచ్చారు. అలా ఇప్పటి వరకు మొత్తంగా 3.5 లక్షల ఫైన్‌ను ఆమెకు విధించడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తంగా ఆమె కట్టిన ఫైన్‌ తో పాటు ఇంకా ఆమెకు సొసైటీ పెద్దలు లక్ష రూపాయలకు పైగా ఫైన్‌ విధించారు.

 • ఆ మొత్తంను చెల్లించేందుకు కూడా ఆమె సిద్దం అయ్యింది. అయినా కూడా కుక్కలకు బోజనం పెట్టకుండా మాత్రం తాను ఉండలేను అంటోంది.

 • కుక్కలకు బోజనం పెట్టినందుకు లక్షల రూపాయలు వసూళ్లు చేసిన వారిని ఏమనాలో మీరే నిర్ణయించండి. అలాంటి వారిపై జంతు సంరక్షకులు ఏం చర్యలు తీసుకోరా…?