కజకిస్థాన్ ఆర్మీ డిపో లో వరుస పేలుళ్లు భయాందోళనకు గురైన ప్రజలు  

Fire Accident In Kajakistan Army Depo -

కజకిస్థాన్ ఆర్మీ ఆయుధ డిపో లో వరుస పేలుళ్ల ఘటన తో ఆ దేశం వణికిపోయింది.ఆర్మీ డిపో లో సోమవారం నాడు ఈ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Fire Accident In Kajakistan Army Depo

ఆర్మీ డిపో లో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం తో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది.దీనితో ఈ ఘటన లో పదుల సంఖ్యలో గాయపడగా,40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తుంది.

డిపో లో సోమవారం ఒక్కసారిగా మంటలు అంటుకోవడం తో అందులోని ఆయుధాలు పెద్ద శబ్దం తో పేలినట్లు కజకిస్థాన్ రక్షణ శాఖ తెలిపింది.మరోపక్క ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు కమ్ముకోవడం తో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

కజకిస్థాన్ ఆర్మీ డిపో లో వరుస పేలుళ్లు భయాందోళనకు గురైన ప్రజలు-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనితో 40 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.అయితే ఈ ఘటన లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే అసలు డిపో లో ఎలా మంటలు చెలరేగాయి, ఆ మంటలకు గల కారణాలు ఏంటి అన్నదానిపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

Fire Accident In Kajakistan Army Depo- Related....