అప్పుడే కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేస్తున్న జగన్ ?  

Jagan Force Kcr Base On Employes Issue-

ఏపీలో జగన్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్న వారిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకరు.వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించారు.ఒకరకంగా చెప్పాలంటే జగన్ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడ్డాడో అంతే కష్టం తెర వెనుక కేసీఆర్ చేసాడన్నది కొద్ది మందికి మాత్రమే తెలుసు..

Jagan Force Kcr Base On Employes Issue--Jagan Force KCR Base On Employes Issue-

ఏదైతేనేమి ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరిపోయింది.చంద్రబాబు బాధ ఇద్దరికీ తప్పిపోయింది అనుకుంటున్న సమయంలో కేసీఆర్ కు జగన్ భయం పట్టుకుంది.ఏపీ ప్రజలను, ఉద్యోగస్తులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ఇవన్నీ కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి.రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో రెండు రాష్ట్రాల మధ్య ఓ భిన్నమైన వాతారణం కనిపించేది.మిగులు రాష్ట్రం తెలంగాణ.

ఉద్యోగులకు ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఐఆర్, పీఆర్సీ ఇచ్చింది.లోటు రాష్ట్రమైనా ఉద్యోగస్తులను నిరాశపరచకూడదని.చంద్రబాబు కూడా ఇవ్వాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు రివర్స్ అయింది.

కేసీఆర్ ఉద్యోగస్తులకు ఐఆర్ ఇవ్వకుండా నాన్చుతున్నారు.కానీ జగన్ మాత్రం 27 శాతం ఐఆర్ ప్రకటించేశారు.అలాగే మరికొన్ని నిర్ణయాలు కూడా జగన్ వెంట వెంటనే తీసేసుకుంటున్నారు.ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఆర్టీసీతో పాటు చిన్న చిన్నఉద్యోగుల జీతాల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.జూలై నుంచి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, సీపీఎస్ రద్దుపై కమిటీని కూడా నియమించారు.దీంతో తెలంగాణలోని ఉద్యోగ వర్గాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.2018 జూలై నుంచే కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది..

వేతనాల పెంపు కోసం కమిటీని నియమించి ఏడాది దాటింది.

ఇంకా పీఆర్సీ కమిటీ నివేదిక కూడా ఇవ్వలేదు.కనీసం మధ్యంతర భృతి కూడా ప్రకటించలేదు.ఏపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ జూలై నుండి ఇస్తామని ప్రకటించింది.సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాల నుంచి తెలంగాణా ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.ఆర్టీసీ విషయంలోనూ జగన్ ఈ విధంగానే దూకుడుగా నిర్ణయం తీసుకున్నాడు.ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం కోసం కమిటీ ని ఏర్పాటు చేసింది.

కానీ తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది.సమ్మె చేస్తే అవసరమైతే ప్రైవేటు పరం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆరే హెచ్చరించారు.ఇలా చూసుకుంటే చాలా విషయాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి.