చైనా కు 29 దేశాల ఝలక్, విచారణ జరపాల్సిందేనంటూ డిమాండ్!  

29 countries demanded investigate persecution against uighur muslims in China , China, Coronavirus, Jin Ping, 29 Muslim Countries, WHO, Ikyarajyasamithi - Telugu 29 Muslim Countries, China, Coronavirus, Ikyarajyasamithi, Jin Ping, Who

చైనాకు మరో ఇబ్బంది కలిగించే పరిణామం చోటు చేసుకుంది.29 దేశాలు ఉగిర్ ముస్లిం ల విషయంలో విచారణ జరపాల్సిందే అంటూ డిమాండ్ చేశాయి.చైనాలో ఉగిర్ ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ సహా 29 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ నేపథ్యంలో చైనా లో పర్యటించి దీనిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కులకు సంబంధించిన బృందం దర్యాప్తు చేయాలని 29 దేశాలు కోరినట్లు తెలుస్తుంది.

 29 Countries Demanded Investigate Persecution Against Uighur Muslims In China

చైనాలో పర్యటించి దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి.దీనిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ… ఈ పరిణామం చైనాకు ఇబ్బంది కలిగించే అంశమే అనే వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఇక చైనాలో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

చైనా కు 29 దేశాల ఝలక్, విచారణ జరపాల్సిందేనంటూ డిమాండ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు చైనాకి ప్రత్యేక టీమ్‌ని పంపబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా చెబుతున్నప్పటికీ కూడా చైనా మాత్రం అనుమతి ఇవ్వడం లేదు.

టీమ్ రాకను అనుమతించాలని మే నుంచి WHO కోరుతున్నా చైనా అనుమతి ఇవ్వలేదు.ఏ జంతువు నుంచి ఆ వైరస్ వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని WHO పట్టుపట్టింది.

మూలం ఏంటో తెలిస్తే… వైరస్‌తో పోరాడేందుకు మరింత ఎక్కువ వీలు కలుగుతుందని WHO చీఫ్ టెండ్రోస్ అధానమ్ తెలిపారు.తమ టీమ్ మూలాన్ని కనుక్కుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు.

ఈ టీమ్ చైనాకి వెళ్లి… అక్కడి వేర్వేరు ప్రాంతాల్లో కరోనా వైరస్ శాంపిల్స్ సేకరిస్తుంది.అలాగే… అక్కడి అనుమానం ఉన్న జంతువుల్ని సేకరించి వాటిపై పరిశోధనలు చేస్తుంది.వైరస్‌లో జన్యువుల వంటివి… ఇతర జంతువుల్లో ఉన్నట్లు తేలితే… తద్వారా ఏ జంతువు నుంచి అది సోకిందో తెలిసే అవకాశం ఉంటుంది.అదే సమయంలో చైనా కుట్ర పూరితంగా వైరస్‌ని సృష్టించిందా అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికే అవకాశం ఉంటుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

#Jin Ping #China #WHO #Coronavirus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

29 Countries Demanded Investigate Persecution Against Uighur Muslims In China Related Telugu News,Photos/Pics,Images..