అమ్మమ్మ కోసం 2800 కి.మీ నడిచిన బాలుడు.. చివరకు..?

ఆ బాలుడి వయస్సు కేవలం పదేళ్లు.ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసినివశించేవాడు.

 Boy Walks 2800 Km For 2 Months From Italy To London To Hug Grandmother, Italy, G-TeluguStop.com

ప్రతి సంవత్సరం సెలవుల్లో తల్లిదండ్రులతో పాటు లండన్ లో నివశించే అమ్మమ్మను చూడటానికి వెళ్లేవాడు.ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మమ్మను చూడటానికి వెళ్లాలని బాలుడు భావించినా కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల అది సాధ్యం కాలేదు.

దీంతో బాలుడు అమ్మమ్మపై బెంగ పెట్టుకున్నాడు.అమ్మమ్మను చూడటానికి నడుచుకుంటూ వెళతానంటూ మంకు పట్టు పట్టాడు.తల్లిదండ్రులను ఒప్పించి మూడు నెలల పాటు తండ్రితో కలిసి 2800 కిలోమీటర్లు ప్రయాణించాడు.బాలుడి తండ్రితో కలిసి 2,800 కిలోమీటర్లు ప్రయాణం చేశాడని తెలిసి లండన్ లోని అధికారులు ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం బాలుడు, తండ్రితో కలిసి క్వారంటైన్ లో ఉండగా మరికొన్ని రోజుల్లో అమ్మమ్మను కలుసుకోబోతున్నాడు.

జూన్ 20వ తేదీన తండ్రితో ప్రయాణాన్ని మొదలుపెట్టిన బాలుడు సెప్టెంబర్ 21న లండన్ చేరుకున్నాడు.

తండ్రి, కొడుకు తమ 90 రోజుల ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అమ్మమ్మతో ప్రేమగా కొన్ని క్షణాలు గడిపితే తన బాధలన్నీ మాయమవుతాయని బాలుడు చెబుతున్నాడు.

ప్రయాణ సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని చెప్పాడు.

ఇంత కష్టపడి ప్రయాణం చేసిన ఆ బాలుడి పేరు రోమియో.

అతను సిసిలీ నుంచి లండన్ వరకు ప్రయాణం చేసే సమయంలో ఫండ్ రైజ్ కూడా చేశాడు.రోమియో ఫండ్ రైజ్ ద్వారా 11.4 లక్షల రూపాయలు సంపాదించగా ఆ డబ్బును శరణార్థుల కొరకు ఖర్చు చేయనున్నాడు.బాలుడి ఆలోచనలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.2,800 కిలోమీటర్లు బాలుడు నడిచాడని తెలిసి నెటిజన్లు బాలుడిని తెగ ప్రశంసిస్తున్నారు.అమ్మమ్మపై ప్రేమతో కాలి నడక ద్వారా రోమియో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube