ఎన్నికల వేళ ట్రంప్ కు నిరసనల సెగ...వ్యూహంలో భాగమేనా..?

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.కేవలం 20 రోజుల వ్యవధిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

 28 Arrested, Tear Gas Used In Wisconsin Protests, Wisconsin Protests, Tear Gas,-TeluguStop.com

ఈ నేపధ్యంలో మరో సారి నల్లజాతీయుల నిరసనలు అమెరికాలో మిన్నంటాయి.ట్రంప్ కి వ్యతిరేకంగా నల్లజాతీయులు చేపట్టిన ఈ నిరసనలు మరోసారి ట్రంప్ వర్గంలో గుబులు పుట్టించాయి.

గతంలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఉదంతం తరువాత వరుసగా ఇద్దరు నల్లజాతీయులపై జాత్యహంకార హత్యలు , దాడులు జరగడం విధితమే.విస్కాన్సిన్ లోని ఓ నల్లజాతీయుడు భయంతో పరుగులు పెడుతున్న క్రమంలో వెనుక నుంచి స్థానిక పోలీసులు కాల్పులు జరిపి అతడి మృతికి కారణమయ్యారు.

ఆల్విన్ కోల్ అనే నల్లజాతీయుడిపై జోసెఫ్ అనే పోలీసు అధికారి కాల్పులు జరిపినా ఇప్పటి వరకూ అతడిపై చర్యలు తీసుకోలేదని నిరసన కారులు నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.కోర్టు సైతం అతడిపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పడంతో ఈ నిరసనలు మిన్నంటాయి.

దాంతో స్థానిక ప్రభుత్వం విధించిన నిభందనలు కాదని నల్లజాతీయులు నిరసనలు ఉదృతం చేశారు.దాదాపు 100 మంది నిరసన కారులు విస్కాన్సిన్ లోని సిటీ హాల్ బయట గుంపులుగా ఉండి కర్ఫ్యూ నిభందనలకు వ్యతిరేకంగా దూసుకువచ్చారు.

దాంతో


విస్కాన్సిన్ సిటీ పోలీస్ అధికారులు నిరసన కారులను వెళ్ళిపోమని చెప్పారు.అయితే నిరసన కారులు ఒక్క సారిగా గాజు సీసాలు పోలీసులపై విసరడంతో బాష్ప వాయువు ప్రయోగించారు.

ఈ ఘటనలో పోలీసులు 28 మంది నిరసన కారులను అరెస్ట్ చేశారు.నిరసన కారులు తమపై పెట్రో బాంబులు, గాజు సీసాలు విసిరారని వారిలో కొందరి వద్ద తుపాకులు కూడా ఉన్నాయని అందుకే అరెస్ట్ లు చేయక తప్పలేదని తెలిపారు.

ఇదిలాఉంటే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కావాలనే ట్రంప్ పై బురద జల్లడానికి ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తోందని ట్రంప్ మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube