ఓట్లను లెక్కపెడుతూ 270 కి పైగా ఎన్నికల సిబ్బంది మృతి.. అసలు విషయం ఇదే...

ప్రపంచం లొనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా.అయితే ఇక్కడ ఇటివలే ఎన్నికలు జరిగాయి.ఆ దేశ అధ్యక్ష పదవికి సంబందించిన జాతీయ మరియు ప్రాంతీయ పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 17 వ తేదీన ఎన్నికలు నిర్వహించారు.26 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో ఓటర్లు కూడా ఎక్కువే.

 270 Election Officers Dead While Counting-TeluguStop.com

దాదాపు 19 కోట్ల ఓటర్లు ఉన్న ఇండోనేషియా దేశం లో అక్కడి ఎన్నికల కమిషన్ ఒకే విడత లో పోలింగ్ నిర్వహించారు.అక్కడి ప్రజలు కూడా తమకి ఇష్టమైన నాయకుడిని గెలిపించుకోవాలని ఓట్లు వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు , మొత్తం మీద ఇక్కడ 80 శాతం ఓట్లర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఓట్లు లెక్కించే సమయం లో వింత రోగం తో సిబ్బంది మృతి

మన దేశం లో లాగా అక్కడ ఎన్నికల కోసం ఈవిఎం లను వాడలేదు.ఇండోనేషియా లో ఎప్పుడు బ్యాలెట్ విధానం లొనే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.మే 22న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో అక్కడి ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో కౌంటింగ్ చేయాల్సి ఉంది , దీంతో అలసటకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వందలాది సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారు.

జనరల్ ఎలక్షన్ కమిషన్(కేపీయూ) తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తంగా 272 మంది ఎన్నికల సిబ్బంది చనిపోగా, 1,878 మంది ఆసుపత్రి పాలయ్యారు.వీరందరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి అక్కడి ప్రభుత్వం ఆర్డర్లు వేసింది.

అంతేకాకుండా చనిపోయిన సిబ్బంది కుంటుంబాలకు నష్ట పరిహారంగా డబ్బును చెల్లించే యోచనలో ఆ దేశ ఆర్థిక శాఖ ఉంది.ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కారణంగానే ఇంతమంది చనిపోయారని ప్రతిపక్ష పార్టీకి చెందిన అహ్మద్ ముజానీ ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube