డ్రగ్స్ మత్తులో భారతీయుడిని చంపింది...చివరికి....

జతిందర్ బ్రార్ అనే భారతీయ యువకుడు చదువుల్లో ముందు ఉండే వాడు.భారత్ లో చదువు పూర్తి చేసుకున్న తరువాత ఉన్నత చదువుకోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు.

 27 Years Old Drug Effected Women Killed Indian Man Jithindar-TeluguStop.com

ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క అక్కడి సూపర్ మార్కెట్ లో ట్రక్ డ్రైవర్ గా పనిలో చేరాడు.అయితే జనవరి లో తన విధులని పూర్తి చేసుకుని స్టోర్ నుంచీ బయటకి వస్తున్న ట్రక్ ని డ్రగ్స్ మత్తులో ఉన్న 27 ఏళ్ళ యువతి.

ఆమె దొంగిలించిన కారుతో వేగంగా వచ్చి డీ కొట్టింది.దాంతో ఒక్క సారిగా పల్టీలు కొట్టిన జతిందర్ ట్రక్ కొంత దూరంలో ఆగింది.ఈ ఘటనలో అక్కడికక్కడే అతడు ప్రాణాలు విడిచాడు.అయితే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆమె అక్కడి నుంచీ తప్పించుకోవడానికి వేగంగా వెళ్ళిపోయింది.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె వాహనాన్ని హెలికాఫ్టర్ సాయంతో వెంబడించారు.

ఎట్టకేలకి ఆమె జాడ తెలుసుకుని పట్టుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరుచాగా ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరించింది.

దాంతో సుమారు ఏడాది పాటుగా జైలులోనే ఉన్న ఆమెకి న్యాయస్థానం 7 ఏళ్ళ జైలు శిక్షని అమలు చేస్తూ తీర్పు చెప్పింది.అంతేకాదు ఆమెకి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ని కూడా రద్దు చేస్తున్నట్టుగా తీర్పు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube