27ఏళ్ల క్రితం బాలయ్య, చిరంజీవి 'ఫ్లైట్'కి ఘోర ప్రమాదం.. అలా బతికిపోయారు!

కొన్ని సార్లు పాత రోజులు గుర్తుకు వ‌స్తుంటాయి.ఆ రోజు ఇలా కాకుండా అలా అయ్యి ఉంటే నా జీవితం చాలా బాగుండేది అంటుంటాం.

 Airbus Company A300 Model,chiranjeevi,balakrishna,tollywood,flight Accident,emer-TeluguStop.com

ఇంకొంద‌రూ ఆ రోజు అలా జ‌రగ‌డం వ‌ల్లే ఈ రోజు నేను బ్ర‌తికున్న అని త‌మ గ‌తానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను చాలా మంది చెప్తుంటారు.అలాంటిదే మ‌న సినీ యాక్ట‌ర్ల విష‌యంలో ఒక‌టి జ‌రిగింది.

ఆరోజు ఏ మాత్రం తేడా అయినా అదో చేదు నిజంగా మిగిలేద‌ని ప‌లువురి సినీ తార‌లు త‌మ గ‌తాన్ని గుర్తుచేస్తుంటారు.ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు టాలీవుడ్ సీని స్టార్లు అంతా క‌లిసి ఆ విమానంలో ప్ర‌యాణం చేశారు.

దానికి సంకేతిక లోపాలు వ‌చ్చాయి.దాంతో ఆ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేయాల్సి వ‌చ్చింది.

ఆ స‌మ‌యంలో అందులో ప్రయాణం చేస్తున్న వారంగా ప్రాణాలు పోవ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారంట‌.ఈ దారుణ‌మైన ఘ‌ట‌న స‌రిగ్గా 27 ఏళ్ల ముందు జ‌రిగింది.

1993 న‌వంబ‌ర్ 15న మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ మీదుగా సినీ ప్ర‌ముఖుల‌తో నిండిన ఒక విమానం బ‌య‌లుదేరింది.ఇందులో తెలుగు సినీ ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, క‌మెడియ‌న్ బ్రహ్మ బ్రహ్మానందం తో స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఉన్నారు.

మొత్తంగా 247మంది అందులో ప్రయాణం చేస్తున్నారు.హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో పొగమంచు ఆవ‌రించ‌డంతో అక్క‌డ ల్యాండింగ్ కు వీలుకాలేదు.

Telugu Airbus Company, Balakrishna, Chiranjeevi, Emergency, Tollywood-Movie

దీంతో ఏం చేయ‌లేక విమానాన్ని మళ్లీ మద్రాస్ కు తీసుకు పోయేందుకు సిద్ధం చేశారు.ఆ సమయంలో నెల్లూరు జిల్లా ఆవరణం లోకి రాగానే ప‌లు సాంకేతిక లోపాలు త‌లెత్తాయి విమానానికి.దాంతో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఫైలెట్లు.ఆ స‌మ‌యంలో అందులో ప్ర‌యాణం చేస్తున్న వారంతా ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని ఉన్నారు.

అప్పుడు పైలట్లు ఎంతో చాకచ‌క్యంగా వెంకటగిరి సమీపంలోని పంట పొలాల్లో ల్యాండ్ చేశారు.దాంతో అందులో ప్రయాణం చేస్తున్న వారంతా ప్రాణాలతో బయట పడ్డారు.

ఆ రోజు జ‌ర‌గ‌కూడ‌నిది ఏం జ‌రిగినా కానీ తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ఎంతో మంది ప్ర‌ముఖుల‌ను కోల్పోయేది.ఈ ఘ‌ట‌న‌ను ప‌లువురు సినీ ప్ర‌ముఖులు గుర్తు చేసుకుని ఇప్ప‌టికి భ‌య‌ప‌డుతుంటారు.

ఎయిర్ బస్ కంపెనీ ఎ300 మోడల్‌కు చెందిన విమానం అది.దాని ఖ‌రీదు అప్పట్లోనే100 కోట్లు.1976లో దీన్ని కొన్నారు.ఆ ప్రమాదానికి గురయ్యే స‌మ‌యంలో 40 వేల గంటలు ఆకాశంలో ప్రయాణించింద‌ని స‌మాచారం.

ఎమ‌ర్జెన్సీ టైంలో ఫైలెట్లు ఆ పంట పొలాల్లో ల్యాండింగ్ చేయడమే మంచిద‌యింద‌ని ప‌లువురు చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube